AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamaha FZ-S FI V4: మరింత ఆకర్షణీయంగా యమహా ఎఫ్‌జెడ్.. కొత్త లుక్ అదిరిపోయిందిగా..

ఇప్పుడు మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో ఈ యమహా ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4(Yamaha FZ-S FI V4)ను తీసుకొచ్చింది. డార్క్ మ్యాట్ బ్లూ, మాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. భైక్ ధర రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త కలర్ ఆప్షన్లలో ఉన్న బైక్లు అధిక సేల్స్ రాబడతాయని కంపెనీ ఆశిస్తోంది.

Yamaha FZ-S FI V4: మరింత ఆకర్షణీయంగా యమహా ఎఫ్‌జెడ్.. కొత్త లుక్ అదిరిపోయిందిగా..
Yamaha Fz S Fi V4
Madhu
| Edited By: |

Updated on: Oct 07, 2023 | 8:30 PM

Share

యమహా కంపెనీకి చెందిన వాహనాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ కంపెనీ నుంచి వచ్చే ఏ ఉత్పత్తికైనా మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది. వాటిల్లో యమహా ఎఫ్ జెడ్ మోడల్ కు యూత్ లో క్రేజ్ ఉంది. అందుకనుగుణంగానే ఆ బైక్ ను యమహా పలు ఆకర్షణలు జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. పలు అప్ గ్రేడ్ల నుచేసి అందుబాటులో ఉంచుతోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో ఈ యమహా ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4(Yamaha FZ-S FI V4)ను తీసుకొచ్చింది. డార్క్ మ్యాట్ బ్లూ, మాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. భైక్ ధర రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త కలర్ ఆప్షన్లలో ఉన్న బైక్లు అధిక సేల్స్ రాబడతాయని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెటాలిక్ గ్రే, మెజెస్టి రెడ్, మెటాలిక్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. వీటికి అదనంగా కొత్త రంగులు యాడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ యమహా ఎఫ్ జెడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

ఈ ఎఫ్‌జెడ్ఎస్ బైక్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైర్-హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంజిన్ గార్డ్, బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన వై-కనెక్ట్ యాప్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లతో ప్రామాణికంగా వస్తుంది. ఇది 136 కిలోల బరువు, 13 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. మోనో-షాక్ సస్పెన్షన్ అందించిన 120ఎంఎం వీల్ ట్రావెల్‌తో పాటు, సింగిల్-పీస్ సీటు, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్ ఉంటుంది.

ఎఫ్‌జెడ్ఎస్ ఇంజిన్ సామర్థ్యం..

మోటార్‌సైకిల్ యొక్క 149సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్సీ 2-వాల్వ్ ఎఫ్ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 7,250ఆర్పీఎం వద్ద 12.4బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. మారకుండా ఉండటంలో ఆశ్చర్యం లేదు. గరిష్ట టార్క్ 13.3ఎన్ఎం, 5,500ఆర్పీఎం వద్ద సంభవిస్తుంది. జపనీస్ తయారీదారు ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు, సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

యమహా నుంచి కొత్త ఉత్పత్తులు..

భారత్ జరగనున్న మోటోజీపీ కార్యక్రమంలో యమహా నుంచి మూడు కొత్త మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. మయహా ఆర్3, ఆర్7 ఎంటీ03 మోడళ్లను ప్రదర్శించనుంది. ఇటీవల ఎంట్రీ-లెవల్ లగ్జరీ మోటార్‌సైకిల్ విభాగంలో మయహా స్థిరమైన మెరుగుదలను చూసింది. తొలుతన యమహా వైజెడ్ఎఫ్-ఆర్3ని విడుదల చేసింది. అయితే బీఎస్6 నిబంధన వల్ల దీనిని కొంత కాలానికి నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఆర్3, ఎంటీ03 మోడళ్లు వచ్చే డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్ ప్రీమియం బైక్ మార్కెట్లో హోండా, సుజుకిలను యమహా ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌