Xiaomi Mi Pad: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్.. చైనాలో మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు..

Xiaomi Mi Pad: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి ఎంఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్‌ను..

Xiaomi Mi Pad: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్.. చైనాలో మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు..
Xiaomi Mi Pad 5

Edited By:

Updated on: Jul 10, 2021 | 11:56 AM

Xiaomi Mi Pad: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి ఎంఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. Xiaomi Mi Padను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ షియోమి ఎంఐ ప్యాడ్‌ 5 చైనాలో పరిశ్రమ, సమాచారం సాంకేతిక మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం పొందినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది వినియోగదారులు ట్యాబ్లెట్లను వినోదం కోసం, ఆఫీస్‌కు సంబంధించి పనుల కోసం ఉపయోగిస్తుంటారు. ఇందులో పెద్ద స్క్రీన్‌టచ్‌ ఉండడమే ఇందుకు కారణం. షియోమి ఎంఐ ప్యాడ్‌ను ఇష్టపడే వారితో సహా అందరు వినియోగదారులకు నచ్చే తరహాలో దీనిని రూపొందించారు. అయితే అధికారికంగా ఫీచర్స్‌ ప్రకటించకపోయినప్పటికీ కొన్ని లీక్‌ల ద్వారా తెలిసిపోతున్నాయి.  ఇందులో 128/512 /జీబీ స్టోరేజీలలో లభ్యమవుతుంది. జీపీఎస్‌, వైఫై, బ్లూటూత్‌ అత్యాధునిక ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ఇందులో కెమెరా 8 ఎంపీ, బ్యాటరీ 6700 ఉంది. దీని డిస్‌ప్లే 11 అంగుళాల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్‌ 870ని ఉపయోగించారు. ఈ సీరిస్‌లో పలు మోడళ్ల ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది షియోమి. అయితే భారత్‌లో దీని ధరపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

అలాగే ఈ ఇందులోనే పలు వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. మిగతా రెండు వేరియంట్లలో వరుసగా 8 జీబీ / 12 జీబీ ర్యామ్, 256 జీబీ / 512 జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. మరో టాప్-ఎండ్ మోడల్ ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌తో రానుంది. ఆగస్టులో భారత్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

ఇవీ కూడా చదవండి

Google Pixel 6: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. అత్యాధుని ఫీచర్స్‌

Realme: ‘రియల్ మీ’ సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..