Expensive Scooters: వామ్మో..! స్కూటర్‌లే ఇంత రేటా..? భారత్‌లో ఉన్న అత్యంత ఖరీదైన స్కూటర్లు ఇవే..

|

Mar 13, 2023 | 2:00 PM

గత రెండేళ్ల నుంచి భారత్‌లో కూడా ఎక్స్‌పెన్సివ్ స్కూటర్లు విరివిగా మార్కెట్‌లోకి రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు సేల్స్ పరంగా కూడా మంచి ఆదరణ లభిస్తుంది. 2023లో భారత్‌లో అందుబాటులో ఉన్న మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

Expensive Scooters: వామ్మో..!  స్కూటర్‌లే ఇంత రేటా..? భారత్‌లో ఉన్న అత్యంత ఖరీదైన స్కూటర్లు ఇవే..
Most Expensive Scooters In India
Follow us on

సాధారణంగా బైక్స్‌తో పోల్చుకుంటే స్కూటర్ల ధరలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరి భావన. చాలా మంది మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలకు స్కూటర్ల కొనుగోలుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే భార్యాభర్తల్లో ఎవరికీ అవసరం వచ్చినా సెల్ఫ్ డ్రైవింగ్‌లో పనులు చక్కబెట్టుకోవచ్చు. అయితే గత రెండేళ్ల నుంచి భారత్‌లో కూడా ఖరీదైన స్కూటర్లు విరివిగా మార్కెట్‌లోకి రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు సేల్స్ పరంగా కూడా మంచి ఆదరణ లభిస్తుంది. 2023లో భారత్‌లో అందుబాటులో ఉన్న మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

బీఎండబ్ల్యూ సీ 400 జీటీ

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్లలో ముందువరుసలో ఉంటుంది. ఈ స్కూటర్ ధర రూ.10.75 లక్షలు(ఎక్స్ షోరూమ్). భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏకైన బీఎండబ్ల్యూ స్కూటర్ ఇదే. 350 సీసీ ఇంజిన్‌తో వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో వచ్చే 34 పీఎస్ గరిష్ట శక్తి వద్ద 35 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గంటలకు 139 కిలో మీటర్ల స్పీడ్‌తో దూసుకుపోయే ఈ స్కూటర్‌లో మిగిలిన ఫీచర్స్ చూస్తే మతిపోతుంది.

కీవే సిక్స్‌టీస్ 300 ఐ

హంగేరి ఆధారిత ద్విచక్ర వాహన తయారీ సంస్థ గతేడాది మేలో ఈ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ రెట్రో శైలితో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 278.8 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ మోటర్ ద్వారా శక్తిని పొందుతుంది. మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ధర రూ.2.99 లక్షలు( ఎక్స్ షోరూమ్).

ఇవి కూడా చదవండి

కీవే వెస్టీ 300 

ఈ స్కూటర్ ధర కూడా రూ.2.99 లక్షలతో ప్రారంభం అవుతుంది. అయితే ఈ స్కూటర్ రెట్రో స్టైలింగ్ థీమ్‌కు వ్యతిరేకంగా అసలైన మ్యాక్సీ స్కూటర్‌గా అందుబాటులో ఉంది. 278.8 సీసీ ఇంజిన్‌తో 18.7 హెచ్‌పీ, 22 ఎన్ఎం శక్తిని ఇస్తుంది. బెనెల్లీ డీలర్‌షిప్‌ ద్వారా ఈ స్కూటర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మ్యాట్ బ్లూ, వైట్, బ్లాక్ కలర్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. 

వెస్సా ఎలిగెంట్ 150 ఎఫ్ఎల్

వెస్సా ఎలిగెంట్ 150 ఎఫ్ఎల్ వెస్పా కంపెనీ ఫ్లాగ్ షిప్ ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ 150 సీసీ ఇంజిన్‌తో 7000 ఆర్‌పీఎం వద్ద 10.47 పీఎస్ శక్తిని, 5500 ఆర్‌పీఎం వద్ద 10.6 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.57 లక్షలు (ఎక్స్-షోరూమ్). ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ మిర్రర్ క్యాప్స్, అలాగే ఫ్లై స్క్రీన్స్ ఉన్నాయి. 

వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150

ఈ స్కూటర్ వెస్పా కంపెనీలో రెండో అత్యంత ఖరీదైన స్కూటర్. దీని ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.54 లక్షల వరకూ ఉంటుంది. అయితే ఈ స్కూటర్ పరిమిత ఎడిషన్‌కు మాత్రమే లాంచ్ చేశారు. ఈ స్కూటర్‌లో కూడా 150 సీసీ ఇంజిన్ ఉంటుంది. రెక్ట్ యాంగిల్ హెడ్ ల్యాంప్‌తో న్యూ లుక్‌తో కనిపించే ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. డ్యుయల్ టోన్ ఎంపికలతో ఫంకీ రంగుతో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..