కోటి రూపాయల విలువైన కారు, విలాసవంతమైన భవంతి లభిస్తే సకల సౌకర్యాలతో హాయిగా జీవితాన్ని గడపవచ్చని ఆశిస్తుంటాం. అయితే, కొంతమంది ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ చెబుతుంటారు. ఏది కొన్నా.. ఇది బ్రాండ్ గురూ అంటూ చూపెడుతుంటారు. అలాంటి వారిలో ఖరీదైన హెడ్ ఫోన్స్ కొనే వారు కూడా ఉన్నారు. ఖరీదైనవి అంటే వందలు, వేలు మాత్రమే.. కోట్లు విలువచేసే ఖరీదైనవి కూడా కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారికోసం పలు కంపెనీలు కూడా అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్‌ని తయారు చేస్తుంటాయి. ఈ కారణంగా రూ. 6.19 కోట్ల ధర హెడ్‌ఫోన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్స్ ఏంటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ బీట్స్ ప్రో , దీని ధర రూ. 6.19 కోట్లు. దీని తయారీకి 6.5 క్యారెట్ల బంగారం, కెంపులను ఉపయోగించి తయారు చేశారు. దీంతో పాటు ప్లాటినం కూడా ఈ హెడ్‌ఫోన్స్ తయారీలో ఉపయోగించారు. దీనిని లండన్‌లోని ఒక ఆభరణాల కంపెనీ తయారు చేసింది.
రెండవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ `ఫోకల్ య్టోపియా` దీని ధర సుమారు రూ. 88 లక్షలు. ఇందులో 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు.
మూడవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ Onkyo H900M డైమండ్. దీని తయారీకి 20 క్యారెట్ల వజ్రాన్ని ఉపయోగించారు. దీని ధర సుమారుగా 100,000 డాలర్లు అంటే దాదాపు 82 లక్షల రూపాయలు.
ఖరీదైన హెడ్‌ఫోన్‌ల జాబితాలో నాల్గవ పేరు సెన్‌హైజర్ బ్రాండ్‌కు చెందినది. దీని పేరు “సెన్‌హైజర్ ఓర్ఫియస్/హెచ్‌ఈ 1”, హెడ్‌ఫోన్ ధర దాదాపు 12,000 పౌండ్లు అంటే దాదాపు 43 లక్షల రూపాయలు.
10 లక్షల హెడ్‌ఫోన్:
ప్రపంచంలో ఐదవ అత్యంత ఖరీదైన హెడ్‌ఫోన్ గురించి మాట్లాడుతూ, స్పిరిట్ టోరినో వాల్కిరియా టైటానియం ఈ జాబితాలోకి వచ్చింది. దీని ధర $12,800 అంటే దాదాపు రూ.10 లక్షలు
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..