Gold Reserve: ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగి ఉన్న టాప్ 10 దేశాలు.. భారతదేశం ఎన్నో స్థానం అంటే..

|

Aug 14, 2022 | 11:52 AM

Gold Reserve: ప్రతి త్రైమాసికంలో ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల వద్ద తమ నిల్వల్లో ఎంత బంగారం ఉందో నివేదికను విడుదల చేస్తుంది. తాజా నివేదిక ప్రకారం..

Gold Reserve: ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగి ఉన్న టాప్ 10 దేశాలు.. భారతదేశం ఎన్నో స్థానం అంటే..
Follow us on

Gold Reserve: ప్రతి త్రైమాసికంలో ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల వద్ద తమ నిల్వల్లో ఎంత బంగారం ఉందో నివేదికను విడుదల చేస్తుంది. తాజా నివేదిక ప్రకారం ట్రెజరీలో అత్యధికంగా బంగారం కలిగి ఉన్న ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఏవో తెలుసుకుందాం.

  1. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలలో నెదర్లాండ్స్ పదో స్థానంలో ఉంది. ఈ దేశ ఖజానాలో 612.45 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
  2. ఈ జాబితాలో భారత్ పేరు తొమ్మిదో స్థానంలో ఉంది. భారతదేశ ఖజానాలో 768 మెట్రిన్ టన్నుల బంగారం ఉంది.
  3. అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలలో జపాన్ పేరు ఎనిమిదో స్థానంలో ఉంది. జపాన్ ఖజానాలో 845.97 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
  4. ఏడో స్థానంలో చిన్న దేశం స్విట్జర్లాండ్ పేరు చేర్చబడింది. స్విట్జర్లాండ్ ఖజానాలో 1040 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల్లో పొరుగు దేశం పేరు చైనా ఆరో స్థానంలో ఉంది. చైనా రాష్ట్ర ఖజానాలో 1948 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
  7. ఈ జాబితాలో రష్యా పేరు ఐదో స్థానంలో ఉంది. రష్యా వద్ద 2298 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
  8. అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ పేరు నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశంలో 2436.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది.
  9. ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇటలీ ట్రెజరీలో 2451.84 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది.
  10. అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల్లో జర్మనీ పేరు రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో 3355.14 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది.
  11. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2022 రెండవ త్రైమాసిక నివేదిక ప్రకారం, అమెరికాలో అత్యధిక బంగారం ఉంది. అమెరికా రిజర్వ్‌లో దాదాపు 8133.47 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి