ఉద్యోగమైనా, వ్యాపారమైనా.. మనలో తెలివితేటలు ఉంటేనే రాణించగలం. ఉద్యోగం చేస్తేనే మనకు విలువ అని కొందరు అనుకుంటారు.. చదువు లేకున్నా కూడా తెలివితో వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చునని మరికొందరి భావన. ఒకవేళ మీరు కూడా ఉద్యోగం కోసం ట్రై చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ఇది మీకోసమే. ఎలాంటి రిస్క్ లేకుండా.. నష్టాలు లేని బిజినెస్‌లు ఏంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా..
మీ దగ్గర వాహనం, పనిలో నైపుణ్యం ఉన్నట్లయితే.. మెడికల్ కొరియర్ సర్వీస్ ప్రారంభించవచ్చు. అవసరమైన వారికి మందులు, పరికరాలు ఇవ్వొచ్చు. అలాగే స్థానిక హాస్పిటల్, మెడికల్ షాపులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
మీకు వంట చేయడం ఇష్టమైతే.. ఈవెంట్ క్యాటరింగ్ మొదలుపెట్టొచ్చు. పార్టీలు, పెళ్లిళ్లు సహా మరేదైనా ఫంక్షన్లకు వంట చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఈ వ్యాపారానికి అస్సలు రిస్క్ ఉండదు. నోరూరించే పచ్చళ్లను తయారు చేసి.. మీరు చుట్టుప్రక్కల వారికి, స్థానికంగా ఉండే షాపులకు హోల్‌సేల్‌గా అమ్మితే.. డబ్బులు బాగా వస్తాయి. వీటితో పాటు టెంట్ హౌస్, కోళ్ళ పెంపకం, పాలు, పెరుగు వ్యాపారాలు.. అటు మెడికల్ షాపు లాంటివి కూడా మంచి ఆదాయాన్ని ఇస్తాయి.