ఎవ్వరైనా సరే దుబాయ్‌ వెళితే బంగారం కొంటారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?

|

Dec 10, 2021 | 6:28 PM

Gold Rates: ఎవరైనా దుబాయ్ టూర్‌కి వెళితే అక్కడి నుంచి బంగారం కొనుక్కుని ఇండియా రావాలని ఆశిస్తారు. అంతేకాదు తెలిసిన వారు

ఎవ్వరైనా సరే దుబాయ్‌ వెళితే బంగారం కొంటారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?
Gold
Follow us on

Gold Rates: ఎవరైనా దుబాయ్ టూర్‌కి వెళితే అక్కడి నుంచి బంగారం కొనుక్కుని ఇండియా రావాలని ఆశిస్తారు. అంతేకాదు తెలిసిన వారు దుబాయ్ వెళ్లినా అక్కడి నుంచి బంగారం కొని తీసుకురావాలని కోరుతారు. అదే దుబాయ్‌ కాకుండా వేరే దేశానికి వెళితే ఎవ్వరూ నోరు మెదపరు. బంగారం, దుబాయ్‌కి ఉన్న సంబంధం ఏంటి..? దుబాయ్‌లో బంగారం కొనడానికి ఎందుకు ఇష్టపడుతారు తదితర విషయాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది బంగారం ధర. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 1 గ్రాము బంగారం ధర 216.00 AED, 10 గ్రాముల ధర 2160 AED. ఇండియా కరెన్సీలో మార్చితే 10 గ్రాములు రూ. 44107. అంటే దుబాయ్‌లో బంగారం రూ. 44 వేలకు లభిస్తుండగా భారతదేశంలో 49 వేల రూపాయలకు లభిస్తోంది. దుబాయ్‌కి ఇండియాకి బంగారం ధరలలో దాదాపు రూ. 6 వేల తేడా ఉంది. అందుకే అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు.

రెండో కారణం దుబాయ్‌లో బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. దుబాయ్‌లోని బంగారం ఇతర దేశాల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే అక్కడి బంగారానికి ఇండియాలో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. దుబాయ్ నుంచి బంగారం కొనడానికి మరొక కారణం డిజైన్. అక్కడి నగలు మంచి డిజైన్‌లో రూపొందిస్తారు. భారతదేశానికి భిన్నమైన డిజైన్‌లు ఉంటాయి. కాబట్టి ప్రజలు బంగారం కొనడానికి దుబాయ్‌కి వెళతారు. అయితే దుబాయ్‌ నుంచి ఇండియాకి తీసుకురావడానికి ఓ లెక్కుంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు విదేశాలలో ఉంటున్నాడు. అతను ఇండియాకి వస్తే అతనికి కొంత మినహాయింపు ఇస్తారు. అదే సమయంలో మీరు 3-4 రోజులు విదేశాలకు వెళ్లి ఆ తర్వాత భారతదేశానికి వస్తున్నట్లయితే మీకు రూల్ భిన్నంగా ఉంటుంది. మనం బంగారం బరువు గురించి మాట్లాడినట్లయితే దాదాపు ఒక సంవత్సరం పాటు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు తమతో 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. (ఈ పరిమితి మహిళలకు). పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకురావచ్చు.

జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..?

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..