Indian Railways: త్వరలోనే రైలు చార్జీల బాదుడు షురూ.. ఆ వర్గాల తీవ్ర ప్రభావం

భారతదేశంలోని ప్రజలకు చౌకైన ప్రయాణ సాధనంగా భారత రైల్వేలు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే మొదటగా రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత రైలు చార్జీలను సవరించేందకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రైలు చార్జీల పెంపు ఏయే వర్గాల ప్రయాణికులపై ప్రభావం చూపుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

Indian Railways: త్వరలోనే రైలు చార్జీల బాదుడు షురూ.. ఆ వర్గాల తీవ్ర ప్రభావం
railway charges

Updated on: Jun 28, 2025 | 4:28 PM

జూలై 1, 2025 నుంచి రైలు చార్జీలు పెంచే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ సుదూర మార్గాల్లో ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం రైల్వే ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ఏసీ క్లాసెస్‌పై కిలోమీటరుకు 2 పైసల పెంపు, స్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్) కిలోమీటరుకు ఒక పైస పెంపు, సెకండ్ క్లాస్‌కు అయితే కిలోమీటరుకు 0.5 పైసల పెరుగుదల ఉంటుంది. అయితే ఈ పెంపు కేవలం 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.  2020 తర్వాత రైలు ధరలు పెరగనున్నాయి. అయితే గతంలో పోలిస్తే ఇది అత్యల్ప పెరుగుదల అని రైల్వే అధికారులు చెబుతున్నారు.

సబర్బన్ రైళ్లతో పాటు నెలవారీ సీజన్ పాస్‌లను ఉపయోగించే ప్రయాణికులపై కొత్త ఛార్జీల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ నిర్ణయం రోజువారీ ప్రయాణానికి లోకల్ ట్రైన్స్‌పై ఆధారపడే లక్షలాది మందికి ఉపశమనాన్ని ఇస్తుంది. డిసెంబర్ 2024లో రైల్వేలపై స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. ఛార్జీల ధరలను ముఖ్యంగా ఏసీ క్లాసెస్‌కు నిర్వహణ ఖర్చులతో సమలేఖనం చేయాలని ఆ కమిటీ మంత్రిత్వ శాఖను కోరింది. 

2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ.92,800 కోట్లు ఆదాయం వస్తుందని రైల్వేలు అంచనా వేస్తున్నాయి. ఛార్జీల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో అదనంగా రూ.700 కోట్లు ఆదాయం రావచ్చు. రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులో, సరసమైనదిగా ఉండేలా చూసుకోవడంతో పాటు నష్టాలను తగ్గించడం కోసమే రైలు చార్జీలను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి