
ప్రజలు తమ ధనాన్ని ఆదా చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్ డ్ డిపాజిట్. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వ భరోసా ఉంటుండటంతో రిస్క్ జీరో ఉంటుంది. దీంతో వీటిల్లో జనాలు అధికంగా పెట్టుబడులు పెడతారు. పైగా రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వార్షిక వడ్డీ రేట్లను సవరించింది. సుకన్య సమృద్ధి స్కీమ్, మూడేళ్ల టైం డిపాజిట్ స్కీమ్ లపై వడ్డీ రేట్లను 20 బేస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అయిన సుకన్య సమృద్ధి యోజనపై 8.2శాతం, మూడేళ్ల టైం డిపాజిట్ పై 7.1 వడ్డీ శాతం లభిస్తోంది. అంతేకాక పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతం, ఎన్‌ఎస్‌సీపై 7.7 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ క్రమంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఏది ప్రయోజనకరంగా ఉంటుంది? ఏది అధిక రాబడిని ఇస్తుంది? ఈ రెండింటిలో ఏది బెస్ట్? తెలుసుకుందాం రండి..
జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి వడ్డీ రేట్లు ఈ విధంగా నిర్ణయించారు..
పౌరులు క్రమం తప్పకుండా పొదుపు చేయడాన్ని ప్రోత్సహించడానికి ఇవి ప్రభుత్వంచే నిర్వహించబడే పొదుపు సాధనాలు. చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలను కలిగి ఉంటాయి – పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు, నెలవారీ ఆదాయ ప్రణాళిక పథకాలు.
పొదుపు డిపాజిట్లలో 1-3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి పొదుపు ధ్రువీకరణపత్రాలు ఉంటాయి. సామాజిక భద్రతా పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ శాలరీ అకౌంట్ ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)తో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షించబడతాయి. పీపీఎఫ్, ఎన్ఎస్సీ మొదలైన చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు మార్కెట్-లింక్ అయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..