Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Vs NSC: ఎఫ్‌డీ, ఎన్ఎస్సీ పథకాలలో ఏది బెటర్? ఎక్కువ వడ్డీతో పాటు అధిక ప్రయోజాలిచ్చేది ఏది? వివరాలు ఇవి..

ఎన్ఎస్సీ 7.7 శాతం వడ్డీ రేటుతో ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ లపై అందిస్తున్న వడ్డీ కన్నా ఇది ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎఫ్ డీ, ఎన్ఎస్సీ ల్లో ఏది బెటర్? వినియోగదారులకు ఎందులో అధిక ప్రయోజనాలు ఉంటాయి?

FD Vs NSC: ఎఫ్‌డీ, ఎన్ఎస్సీ పథకాలలో ఏది బెటర్? ఎక్కువ వడ్డీతో పాటు అధిక ప్రయోజాలిచ్చేది ఏది? వివరాలు ఇవి..
best investment scheme
Follow us
Madhu

|

Updated on: Apr 26, 2023 | 4:15 PM

ఎటువంటి రిస్క్ లేని, స్థిరమైన ఆదాయాన్నిచ్చే పథకాలలో ప్రజలు తమ ధనాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో వారికి మొదటి ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). దీనిలో ట్యాక్స్ మినహాయింపులతో పాటు తమ రాబడికి ప్రభుత్వ భరోసా కూడా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వినియోగదారులు ఎఫ్‌డీ ఖాతాలు ప్రారంభిస్తున్నారు. ఇదే స్థాయిలో ప్రాధన్యమున్న మరో పథకం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ) దీనిలో కూడా అదే రకమైన పన్ను ప్రయోజనాలు, వడ్డీ రేట్లు ఉంటాయి. వినియోగదారులు ఈ పథకంలో కూడా పెట్టుబడి పెట్టేందుకు బాగానే ముందుకువస్తున్నారు. అయితే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేటు సవరణ తర్వాత, ఎన్ఎస్సీ 7.7 శాతం వడ్డీ రేటుతో ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ లపై అందిస్తున్న వడ్డీ కన్నా ఇది ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎఫ్ డీ, ఎన్ఎస్సీ ల్లో ఏది బెటర్? వినియోగదారులకు ఎందులో అధిక ప్రయోజనాలు ఉంటాయి? వాటిల్లో ఉండే ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)..

ఎన్ఎస్సీ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన స్థిర-ఆదాయ పెట్టుబడి పథకం. పోస్ట్ ఆఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీనిలో ఎటువంటి మీరు గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. కనీస మొత్తం రూ. 1,000 నుంచి ఆపైన రూ. 100 గుణిజాలతో ఎంతైన పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల కాలవ్యవధితో ఈ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తంపై ఏటా వడ్డీ జమ చేస్తారు. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పెట్టుబడి పెట్టిన మొత్తంపై రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా మీరు పథకాన్ని పునరుద్ధరించవచ్చు. అయితే దీనిలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే వడ్డీ రేట్ల మార్పులు జరుగుతుంటాయి. అలాగే కాల వ్యవధికన్నా ముందే అంటే ఖాతాను ప్రీ మెచ్యూర్ గా విత్ చేయడానికి వీలు పడదు. అలాగే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు..

మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించవచ్చు. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు దీని కాల వ్యవధి ఉంటుంది. అయితే సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనాలు ఐదేళ్ల లాక్-ఇన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎఫ్ డీ రేట్లు వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతాయి. ఈ ఎఫ్ డీ ప్రధాన ప్రయోజనం పన్ను ఆదా. అయితే మీరు సంపాదనను బట్టి పన్ను శ్లాబ్ పడుతుందని మాత్రం గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎన్ఎస్సీ, ఎఫ్‌డీల మధ్య తేడాలు..

వడ్డీ చెల్లింపు.. ఎన్ఎస్సీలో ఎన్ఎస్సీలో మీరు కుమ్యూలేటివ్ వడ్డీని పొందుతారు. లాక్ ఇన్ పీరియడ్ మధ్యలో వచ్చిన వడ్డీని తీసుకునే అవకాశం ఉండదు. అదే ఎఫ్ డీలో అయితే నెలవారీ లేదా త్రైమాసిక వడ్డీ ని తీసుకోవచ్చు.

కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ.. ఎన్ఎస్సీలో ఏటా వడ్డీ ని జమ చేస్తారు. అయితే ఎఫ్ డీలో త్రైమాసికానికి జమ చేస్తారు. అందువల్ల, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రీఇన్వెస్ట్‌మెంట్ ఎంపికను తీసుకుంటే, అధిక కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీతో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

పన్ను విధింపు.. రెండు పథకాలలో సెక్షన్ 80సీ కింద మీరు ఒక సంవత్సరంలో రూ. 150,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్ఎస్సీలో టీడీఎస్ ను కట్ చేయరు. అదే ఎఫ్ డీల్లో అయితే మీ పెట్టుబడిపై వడ్డీ రూ. 40,000 దాటితే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అదే సీనియర్ సిటిజనులకైతే ఈ లిమిట్ రూ. 50,000 వరకూ ఉంటుంది. అయితే ఈ టీడీఎస్ కటింగ్ ల నుంచి తప్పించుకోవాలంటే ఫారం 15జీ ని సమర్పించాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటీజన్స్ కు అయితే 15హెచ్ సమర్పించాలి.

గరిష్ట పెట్టుబడి పరిమితి.. ఎన్ఎస్సీలో పెట్టుబడికి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అయితే పన్ను ఆదా చేసే ఎఫ్డీలో మాత్రం కొన్ని బ్యాంకుల్లో గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు. కాబట్టి ఎన్ఎస్సీలో ఐదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో ఆదాయం గ్యారెంటీ . చివరిగా.. రెండు పథకాలు హామీతో కూడిన ఆదాయాన్ని అందిస్తాయి. కానీ ఎన్ఎస్సీ సార్వభౌమ హామీని అందిస్తుంది. పన్ను ప్రయోజనాలు, లాక్-ఇన్ పీరియడ్‌లు రెండు ఇన్‌స్ట్రుమెంట్‌లలో ఒకే విధంగా ఉన్నప్పుడు, మేలైన ఆప్షన్ ను ఎంపిక చేసుకునేందుకు మీరు వడ్డీ రేటును, మీ సాధారణ చెల్లింపు అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..