Tata Motors: ట్రక్ డ్రైవర్లకు భరోసా.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్-TV9 నెట్‌వర్క్ అద్భుత ప్రయత్నం

రాఖీ పండుగను టాటా మోటార్స్ ప్రత్యేకంగా జరుపుకుంది. టాటా ప్లాంట్‌లో పనిచేసే మహిళా కార్మికులు తమ చేతులతో ట్రక్ డ్రైవర్ల కోసం రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు కేవలం దారాలు మాత్రమే కాదు.. దేశాన్ని ముందుకు నడిపే డ్రైవర్ల భద్రతకు, సంక్షేమానికి ప్రతీక.

Tata Motors: ట్రక్ డ్రైవర్లకు భరోసా.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్-TV9 నెట్‌వర్క్ అద్భుత ప్రయత్నం
When Safety Meets Sentiment

Updated on: Sep 01, 2025 | 8:28 PM

ఈ రక్షా బంధన్ పండుగకు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, TV9 నెట్‌వర్క్ కలిసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాయి. “రక్షా కా బంధన్” అనే పేరుతో చేపట్టిన ఈ ప్రయత్నంలో, జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో పనిచేసే మహిళా కార్మికులు తమ చేతులతో ట్రక్ డ్రైవర్ల కోసం రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు కేవలం దారాలు మాత్రమే కాదు, దేశాన్ని ముందుకు నడిపే డ్రైవర్ల భద్రతకు, సంక్షేమానికి ప్రతీక.

జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ప్లాంట్‌లో, క్రాష్-టెస్టెడ్ క్యాబిన్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ట్రక్కులను తయారు చేయడంలో ఈ మహిళలు పాలుపంచుకుంటారు. ఈ ట్రక్కులు కేవలం వాహనాలు కావు.. అవి డ్రైవర్ల జీవితాలు, జీవనోపాధికి భద్రత కల్పిస్తాయి. ఈ ఆలోచనతోనే తమకు తెలియని డ్రైవర్ల కోసం, వారికి కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమతో రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలలో వారు డ్రైవర్లు సురక్షితంగా ఉండాల ప్రార్థనలు ఉన్నాయి.

ఈ రాఖీలు జంషెడ్‌పూర్ నుండి బయలుదేరి రాష్ట్రాల మీదుగా నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చేరుకున్నాయి. అక్కడ వీటిని ట్రక్ డ్రైవర్లకు ప్రేమతో కట్టారు. ఇది డ్రైవర్లకు భావోద్వేగ భరోసాను ఇచ్చింది. దేశం కోసం వారు చేసే కష్టాన్ని ఎవరో గుర్తించారని, వారి ప్రయాణాలు విలువైనవని ఇది గుర్తుచేసింది.

టీవీ9తో కలిసి

ఈ భావోద్వేగ ప్రయాణంలో TV9 నెట్‌వర్క్ టాటా మోటార్స్‌తో కలిసి పనిచేసింది. మహిళలు రాఖీలు తయారు చేయడం నుండి, డ్రైవర్లకు వారి సందేశాలను పంపడం, మరియు వారి చేతులకు రాఖీలు కట్టడం వంటి ప్రతి అడుగును చిత్రీకరించారు. ఈ ప్రత్యేక వీడియోలు, కథనాలు TV9 నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. ఈ కార్పొరేట్ కార్యక్రమం దేశవ్యాప్తంగా బంధాలను జరుపుకునే పండుగగా మారింది.

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ కేవలం సాంకేతిక ఆవిష్కరణలను మాత్రమే కాకుండా మానవ సంబంధాలను కూడా పెంపొందించగలదని ఈ కార్యక్రమం ద్వారా చూపించింది. బలమైన రక్షణ బలమైన బంధాల నుండి పుడుతుందని, ట్రక్ డ్రైవర్ల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని మరోసారి ఈ సంస్థ నిరూపించింది. ఈ కార్యక్రమం దేశాన్ని ముందుకు నడిపిస్తున్న డ్రైవర్లకు టాటా మోటార్స్ ఇచ్చిన నిజమైన వందనం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..