Budget 2024: బడ్జెట్ 2024 ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చునంటే.? అంచనాలు ఇవే

|

Jul 22, 2024 | 9:53 PM

జూలై 23, మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర బడ్జెట్‌తో సహా నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మోదీ 3.0 ప్రభుత్వానికి ఇదే తొలి బడ్జెట్ కావడంతో..

Budget 2024: బడ్జెట్ 2024 ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చునంటే.? అంచనాలు ఇవే
Budget 2024
Follow us on

జూలై 23, మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర బడ్జెట్‌తో సహా నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మోదీ 3.0 ప్రభుత్వానికి ఇదే తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది.? ఏయే సెక్టార్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది.? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానాలు తేలనున్నాయి.

టీవీ9 తెలుగులో బడ్జెట్ విశేషాలు చూడటానికి కింద లింక్ క్లిక్ చేయండి..

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం రెండు మూడు గంటల పాటు సాగే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్‌ సమయంలో ఆమె తన ప్రసంగాన్ని కేవలం 87 నిమిషాలు మాత్రమే చేసింది. ఇక ఆమె 2020 బడ్జెట్ ప్రసంగం 160 నిమిషాలు, అంటే 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర బడ్జెట్ 2024ను లైవ్‌లో చాలా చోట్ల వీక్షించవచ్చు. సంసద్ టీవీ, దూరదర్శన్ ఛానెల్‌లతో పాటు.. ఆయా టీవీల యూట్యూబ్ ఛానెళ్లలో కూడా చూడవచ్చు. ఇదే కాదు.. టీవీ9 ఛానెల్‌, యూట్యూబ్ ఛానెల్‌లోనూ బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారంతో పాటు బడ్జెట్ ముఖ్యాంశాలను వీక్షించవచ్చు. లైవ్ బ్లాగ్‌ ద్వారా బడ్జెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్రేకింగ్స్, కీలక విషయాలు, ఆదాయపు పన్ను మార్పులు లాంటివి టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

బడ్జెట్: ఆసక్తికరమైన విషయాలు..

భారతదేశపు మొదటి బడ్జెట్‌ను 7 ఏప్రిల్ 1860న జేమ్స్ విల్సన్ సమర్పించారు. నవంబర్ 26, 1947న స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్‌ను సమర్పించిన మొదటి వ్యక్తి షణ్ముఖం చెట్టి. ఆర్థిక మంత్రి సిడి దేశ్‌ముఖ్ 1950 నుండి 1956 వరకు ఏడు బడ్జెట్‌లను సమర్పించారు. ఇందులో 1952 మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది. దేశ్‌ముఖ్ తర్వాత ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ, నెహ్రు, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌లను సమర్పించిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..