Retirement Planning: ఈపీఎఫ్.. పీపీఎఫ్.. వీపీఎఫ్.. వీటిల్లో ఏది బెస్ట్? పదవీవిరమణ సమయంలో అధిక రాబడినిచ్చేది ఏది?
ప్రభుత్వ భరోసాతో ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి పథకాలలో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈవీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) అత్యంత ప్రజాదరణ పొందినవి. ప్రతి పథకంలోనూ ప్రత్యేక ప్రయోజనాలు, విభిన్న నిబంధనలు ఉంటాయి.

ఇటీవల కాలంలో అందరూ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నారు. రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి పొదుపు బాట పడుతున్నారు. అందుకోసం ప్రభుత్వ భరోసాతో ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి పథకాలలో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈవీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) అత్యంత ప్రజాదరణ పొందినవి. ప్రతి పథకంలోనూ ప్రత్యేక ప్రయోజనాలు, విభిన్న నిబంధనలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో రకమైన విత్ డ్రా రూల్స్, అర్హత, రిస్క్ ఫ్యాక్టర్ లు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటినన్నంటిని అర్థం చేసుకున్న తర్వాత వీటిల్లో మీకు ఏది మంచిదో దానిలో పెట్టుబడి పెట్టుకోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో వీపీఎఫ్, పీపీఎఫ్, ఈపీఎఫ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)..
ప్రతి ఉద్యోగికి ఇది తప్పనిసరి పదవీ విరమణ పొదుపు పథకం. యజమాని, ఉద్యోగి ఇద్దరూ ఉద్యోగి పేరిట నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి వేతనం ప్రకారం ఎంత కంట్రిబ్యూషన్ అనేది నిర్ణయిస్తారు. పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయి. మొత్తం కార్పస్ విత్ డ్రా చేయాలంటే మాత్రం ఉద్యోగి పదవీ విరమణ తర్వాతే సాధ్యమవుతుంది. ఈ ప్లాన్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. నెలనెలా జీతం పొందే వ్యక్తులకు పదవీ విరమణ ప్లానింగ్ కు ఈ పథకం మంచి ఎంపిక.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)..
రిటైర్ మెంట్ అప్పుడు వచ్చే నగదుపై పన్నులను ఆదా చేసుకునేందుకు ఈ పీపీఎఫ్ ఉపకరిస్తుంది. పీపీఎఫ్ టెన్యూర్ కనీసం 15 సంవత్సరాలు. నిర్దిష్ట వ్యవధి తర్వాత పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయి. తమ దీర్ఘకాలిక పొదుపు ప్లాన్‌లో కొంత సౌలభ్యాన్ని కోరుకునే వారు ఎవరైనా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్)..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కి నెలవారీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ అదనంగా పొదుపు చేయాలని భావిస్తే ఈ పథకం ఉపయోగపడుతుంది. ఉద్యోగులు స్వచ్ఛంద ప్రాతిపదికన ఎక్కువ మొత్తాలను ఫండ్‌కి ఇవ్వవచ్చు. అంటే బోనస్ లేదా ఇతర ఆదాయాన్ని అధికంగా పొందినట్లయితే.. ఉదాహరణకు, ఆస్తి నుండి అద్దె లేదా మ్యూచువల్ ఫండ్‌ల నుండి జీతానికి అదనంగా వచ్చే ఆదాయాన్ని వారి పదవీ విరమణ ప్రణాళికకు జోడించవచ్చు. ఇది వారి ఆర్థిక లక్ష్యాలను మరింత సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఐదేళ్ల తర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకుంటే, ఎలాంటి పన్ను మినహాయించబడదు.
మీకు ఏది మంచిది?
ఈపీఎప్, వీపీఎఫ్ ప్రాథమికంగా ఒకే విధంగా ఉంటాయి. ఈపీఎఫ్ లో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. అదే వీపీఎఫ్ లో అయితే స్వచ్ఛందంగా మీరు నగదు పొదుపు చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఇక పీపీఎఫ్ లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉన్నప్పటికీ సౌకర్యవంతమైన ఉపసంహరణలను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..