
చాలా మంది సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB)లపై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే అందులో వచ్చే రాబడిని బాగా ఆకర్షిస్తుంది. అందుకే నెక్స్ట్ సిరీస్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఓ వ్యక్తికి నవంబర్ 2015లో జారీ చేసిన మొట్టమొదటి SGBల సిరీస్ ఇటీవల 30 నవంబర్, 2023న మెచ్యూర్ అయ్యింది. ఈ బాండ్‌లో పెట్టుబడి పెట్టినవారు 128% కంటే ఎక్కువ రాబడిని పొందారు. ప్రతీ సంవత్సరం వచ్చే వడ్డీని కూడా జోడిస్తే, ఈ 8 సంవత్సరాలలో.. సావరిన్ గోల్డ్ బాండ్‌లు దాదాపు 150% రాబడిని అందించాయి. CAGR లేదా వార్షిక వృద్ధి రేటు ఆధారంగా ఇది 12.6% రాబడిని అందిస్తుందని అర్థమైంది. ఇది FDలు, ఇతర ప్రభుత్వ బాండ్‌లతో పోలిస్తే చాలా మెరుగైనదనే చెప్పాలి. సావరిన్ గోల్డ్ బాండ్‌ల ఫస్ట్ సిరీస్ లో కళ్లు చెదిరే రిటర్న్స్ రావడం చూసిన రాధ వంటివారు ఇప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు.
కానీ ఆర్బీఐ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్‌లలో ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుబడి పెట్టలేం. చాలా మంది పెట్టుబడిదారులు ఎస్‌జీబీలలో ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా మిస్ అవుతామేమో అని ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయని వారి నమ్మకం.
మీరూ వారిలో ఒకరు అయితే, అస్సలు బాధపడకండి. కొత్త సిరీస్ జారీ కోసం వెయిట్ చేయడానికి బదులు.. మీరు సెకండరీ మార్కెట్లు లేదా స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ విడత డిసెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 12–16 తేదీల్లో నాలుగో విడతగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి SGBలను కొనుగోలు చేయడం కూడా చాలా సులభం. అలా చేయడానికి, మీకు డీమ్యాట్ ఖాతా కచ్చితంగా ఉండాలి.
మీరు బ్రోకర్లు , Groww, Paytm వంటి అప్లికేషన్ల ద్వారా కూడా SGBలను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, షేర్ మార్కెట్‌లో లిస్ట్ కావడానికి, ఒక కంపెనీ IPO లేదా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ని అందిస్తుంది. ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత, పెట్టుబడిదారులు దాని షేర్లను బ్రోకర్లు లేదా యాప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ పనితీరుపై ఆధారపడి, షేర్ల విలువ తగ్గచ్చు లేదా పెరగచ్చు.
అదేవిధంగా RBI కొత్త సిరీస్‌ను జారీ చేసినప్పుడు, సబ్ స్క్రిప్షన్ కోసం అది కొద్దిరోజుల మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత, అవి బిఎస్‌ఇ , ఎన్‌ఎస్‌ఇలో లిస్ట్ అవుతాయి. అక్కడ అవి స్టాక్స్ లాగే ట్రేడ్ అవుతాయి. బంగారం ధరల పెరుగుదల, తగ్గుదలపై ఆధారపడి, మారకంలో SGBల విలువ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలు, SGBల ధరలలో తేడా ఉంది. వాటిపై సంపాదించిన వడ్డీ ఆధారంగానే ఈ తేడా కనిపిస్తుంది. SGBలు 2.5% వార్షిక వడ్డీని సంపాదించాయి. ఈ వడ్డీని SGB ఇష్యూ ధర ఆధారంగా లెక్కించారు. ప్రస్తుత బంగారం ధరలపై కాదని ఇక్కడ కచ్చితంగా గమనించాలి. మూడు సంవత్సరాల క్రితం SGB ఇష్యూ ధర రూ. గ్రాముకు రూ.4,000 అని అనుకుందాం. మూడు సంవత్సరాల తర్వాత, ఇష్యూ ఇప్పుడు గ్రాముకు రూ. 6,000గా ఉంది. SGBలు దాని ప్రస్తుత ట్రేడింగ్ ధరపై కాకుండా దాని ఇష్యూ ధరపై ట్రేడ్ అవుతాయి.
సో, మీరు గ్రాముకు రూ. 4,000 ధర వద్ద ఇష్యూ అయిన 10 గ్రాముల విలువైన బంగారు బాండ్లను కొనుగోలు చేస్తే, ఆమె రూ. 60,000 పెట్టుబడి పెట్టాలి. వార్షిక వడ్డీగా రూ. 1,000 వస్తుంది. అంటే రూ. 40,000కు లో 2.5% చొప్పున వడ్డీ కడితే ఈ మొత్తాన్ని అందుకుంటారు. కానీ అదే మొత్తాన్ని RBI జారీచేసిన వాటిలో పెడితే వార్షిక వడ్డీగా రూ.1,500 వస్తుంది. అంటే.. రూ. 60,000కు 2.5% వడ్డీని లెక్కగడితే ఈమొత్తం అందుకుంటారు. గోల్డ్ బాండ్లకు 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అందుకే రాధ సెకండరీ మార్కెట్ నుండి బంగారు బాండ్లను కొనుగోలు చేస్తే వాటి మెచ్యూరిటీ తీరే వరకు వాటిని ఉంచుకోవాలి. మెచ్యూరిటీకి ముందు బాండ్లను విక్రయిస్తే, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది
పన్ను విధింపు
మీరు SGBలను కొనుగోలు చేసిన 1 సంవత్సరంలోపు విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. బాండ్ల నుండి వచ్చే ఏదైనా ఆదాయం మీ వార్షిక ఆదాయానికి జోడిస్తారు. దాని ఆధారంగా వర్తించే పన్నులను కూడా చెల్లించాలి. కొనుగోలు చేసిన 1 సంవత్సరం తర్వాత SGBలను విక్రయిస్తే, 10% చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనాలను కూడా పొందాలనుకుంటే, మీరు 20% చొప్పున పన్నులు చెల్లించాలి. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేసిన బాండ్లను మెచ్యూర్ అయిన తర్వాత విక్రయిస్తే, మొత్తం లాభంపై అసలు పన్నే ఉండదు. కమోడిటీ మార్కెట్ నిపుణుడు రవి సింగ్.. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి SGBలు మంచి ఎంపిక అని చెప్పారు . ప్రస్తుతం మార్కెట్లలో బంగారం ధర రూ.64,000గా ఉంది, ఇది ఆల్ టైమ్ హై అనే చెప్పాలి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే రానున్న 3-4 నెలల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే సెకండరీ మార్కెట్ల ద్వారా SGBలలో పెట్టుబడి పెట్టకుండా దూరంగా ఉండటం మంచిది. ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఇష్యూలో పెట్టుబడి పెట్టడం బెటర్. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి SGBలు మంచి ఎంపిక. అందువల్ల దీన్ని మీ పోర్ట్‌ఫోలియోకు కచ్చితంగా జోడిస్తే మంచిదని చెప్పచ్చు. ఆర్‌బిఐ ప్రారంభించిన ఇష్యూలలో పెట్టుబడి పెడితే అధిక రాబడిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండరీ మార్కెట్ ద్వారా SGBలను కొనుగోలు చేస్తున్నట్లయితే, మెచ్యూరిటీ వరకు వాటిని కలిగి ఉండటం మంచిది. లేకపోతే, పన్నులు చెల్లించిన తర్వాత మీ మొత్తం రాబడులు తగ్గే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి