భారత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ద్వారా జారీ చేయబడిన న్యాయమైన ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీగా చెప్పవచ్చు. అక్టోబర్ 7న ఆర్బీఐ కాన్సెప్ట్ నోట్‌లో ఈ విషయం తెలిపింది. డిజిటల్ రుపీని ఆర్బీఐ రెండు వెర్షన్లలో లేదా ఈ-రుపీగా జారీ చేయనుంది. ఆర్బీఐ ద్వారా జారీ చేసే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధారణ కరెన్సీలాగే లావాదేవీలకు వినియోగించవచ్చు. డిజిటల్ కరెన్సీని రెండు వెర్షన్లలో ఆర్బీఐ ప్రతిపాదించింది. సాధరణ వినియోగం లేదా రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, హోల్‌సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రైవేట్ రంగం, ఆర్థికేతర వినియోదారులు, వ్యాపారాలలో వినియోగించవచ్చు. హోల్‌సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కొన్ని ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించడానికి అనుమతి ఉంటుంది.
రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ నగదుకి ఎలక్ట్రానిక్ వెర్షన్ గా రిటైల్ లావాదేవీల కోసం ఉండగా, హోల్ సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బ్యాంకుల మధ్య బదిలీలు, హోల్ సేల్ లావాదేవీల కోసం నిర్దేశించింది. ఇప్పటి నుంచి, ఇతర హోల్‌సేల్ లావాదేవీలు, విదేశీ చెల్లింపుల పై పైలెట్ వెర్షన్‌లో దృష్టి పెడతారు. ఈ సమయంలో వచ్చే లోటు పాట్లను భవిష్యత్‌లో క్రమబద్ధీకరిస్తారని రెగ్యులేటర్( ఆర్బీఐ) తెలిపింది. క్యాష్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మధ్య భేదాన్ని గతంలో ఆర్బీఐ వివరించింది. ఇప్పటికే ఉన్న డిజిటల్ కరెన్సీకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పూర్తి భిన్నమని, రిజర్వ్ బ్యాంక్‌కి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి అప్పులాంటిదని, కమర్షియల్ బ్యాంకులకు కాదని తెలిపింది.సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వినియోగంలోకి తేవడం దాని వృద్ధి ఆర్బీఐ అనుసరించే పరిశోధన, పైలట్ ప్రోగ్రాంలపై ఆధారపడి ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వినియోగంలోకి తెచ్చే క్రమంలో మౌలిక వసతుల ఏర్పాటులో మంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రతిపాదన కాన్సెప్ట్ నోట్ లో లేదు. భవిష్యత్ లో దీనిపై మరిన్ని విధాన సందిగ్ధతలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఇండియా వెనకబడి లేదు. జాగ్రత్తగా చక్కని సయోధ్యతో డిజిటల్ రుపీ వినియోగానికి రోడ్ మ్యాప్ తయారు చేయడమే ఉత్తమం.
డిజిటల్ రుపీ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ రుపీ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలుస్తుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. మార్కెట్లో ఆర్థిక చేరిక, ద్రవ్య నగదు లావాదేల పద్ధతి మరింత సమర్థవంతంగా సనిచేస్తుందని భావిస్తోంది. ప్రస్తుతమున్న నగదు లావాదేవీలకు అదనంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అదనపు మార్గంగా పనిచేస్తుందని, ప్రస్తుతం అమలులో ఉన్న నగదు వ్యవస్థను మార్చే ఉద్దేశ్యం లేదని రెగ్యులేటర్ (ఆర్బీఐ) తెలిపింది.
నవంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్ సేల్ విభాగంలో డిజిటల్ రుపీ పైలట్ ప్రోగ్రాం ప్రారంభించనుంది. సెంట్రల్ బ్యాంక్ ఈ పైలట్ ప్రోగ్రాం అమలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, హెఎస్‌బీసీ లాంటి9 బ్యాంకులను గుర్తించింది.
ప్రభుత్వ సెక్యూరిటీలలో సెకండరీ మార్కెట్ వావాదేలలో సెటిల్మెంట్లను పైలట్ ప్రోగ్రాంలో చేస్తామని ఆర్బీఐ అక్టోబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. హోల్ సేల్ ఈ రూపీ వినియోగంతో బ్యాంకుల మధ్య లావాదేవీలు సమర్థవంతంగా జరుగుతాయని, నగదు లావాదేల కోసం అయ్యే ఖర్చు మౌలిక వసతుల ఖర్చు కూడా తగ్గుతుందని భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తెలిపింది. రిటైల్ డిజిటల్ ఈ రుపీ మొదటి పైలట్ ప్రోగ్రాంలో కొన్ని వినియోగాదారుల సమూహాలు , వ్యాపార సమూహాలతో కలిసి నెల రోజుల్లో ప్రారంభించడానికి ఆర్బీఐ ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..