Blue Color Aadhaar: ప్రస్తుతం ఆధార్ కార్డు ముఖ్యమైనదిగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు, అలాగే చిన్న చిన్న అవసరాలకు కూడా ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే ఆధార్ జారీ పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా జారీ చేస్తారు. కానీ ఐదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకు జారీ చేసే కార్డు వేరే ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఈ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లా మాత్రమే కాదు ప్రతి అవసరానికి కీలకంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాల్సిందే. అయితే 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డును బాల్ ఆధార్ కార్డు అంటారు. ఈ ఆధార్‌కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు అందించాలో చూద్దాం.
బాల ఆధార్ పేరుతో ప్రత్యే కార్డు..
భారత ప్రభుత్వం పిల్లల కోసం బాల్ ఆధార్ పేరుతో ప్రత్యేక ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఇది నీలం రంగులోనూ, సాధారణ కార్డుకు కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేస్తామో దీనిని కూడా అలాగే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ,ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, పిల్లల పుట్టిన తేదీ డాక్యుమెంట్లను జతచేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐ మొత్తం 31 ఐడెంటిటీ ప్రూఫ్, 44 అడ్రస్ ప్రూఫ్, 14 ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, 14 డేటా ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అంగీకరిస్తుంది ఆధార్ సంస్థ. వీటిలో దేనినైనా ఆధార్ నమోదుకు ఫ్రూప్‌గా అందించవచ్చు.
ఐదు సంవత్సరాలు దాటితో ఈ ఆధార్ పని చేస్తుందా..?
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ నీలం రంగులోని బాల్ ఆధార్ కార్డును పొందడానికి అర్హులు. వారికి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బాల్ ఆధార్ చెల్లదు. ఆ తర్వాత మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల స్కూల్లో ఇచ్చే ఐడెంటిటీ కార్డును ఉపయోగించి ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలకు ఆధార్ నమోదు చేసే ముందు తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ఆధార్‌ను అందిస్తారు.
15 ఏళ్ల వయసులో ఆధార్ అప్‌డేట్
చిన్నారుల బయోమెట్రిక్ ఆధార్ డేటాను 5 సంవత్సరాల వయస్సులో, మళ్లీ 15 సంవత్సరాల వయస్సులో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి తీసుకున్న డిశ్చార్జ్ స్లిప్‌తో బాల ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ డేటాలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారం ఉండదు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత, బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకు ఈ విధంగా ఆధార్‌ను జారీ చేస్తారు. గతంలో పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా ఆధార్ నమోదు చేసుకునే వారు. కానీ ఇప్పుడు పిల్లల పేరుపై ఏదైనా బ్యాంకు లావాదేవీలు, పాఠశాలల్లో చేర్పించే సమయంలో, ఇతర వ్యవహారాల్లో ఆధార్ అందించడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఐదు సంతవ్సరాల్లోపు ఉన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి అయ్యింది.
ఇవి కూడా చదవండి: