
భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంత ఇంతా కాదు. అయితే భారతదేశంలో బంగారం చాలా శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో దేశంలో బంగారం సమస్యకు చెక్ పెట్టడానికి సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం నవంబర్ 2015లో తీసుకొచ్చింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా ప్రారంభించిన భారత ప్రభుత్వంతో సంప్రదించి ఆర్‌బీఐ ద్వారా విడతల వారీగా సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు. ఆర్‌బీఐ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఎస్‌జీబీల రేటును ఆర్‌బీఐ ప్రతి కొత్త విడత ముందు పత్రికా ప్రకటన ద్వారా ప్రకటిస్తుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సావరిన్ గోల్డ్ బాండ్స్ సంబంధించిన తదుపరి విడత ఈ నెలలో సభ్యత్వం కోసం తెరిచారు. 2023–24 సిరీస్ III కోసం సబ్‌స్క్రిప్షన్ తేదీ డిసెంబర్ 18–22, 2023 నుంచి అయితే సిరీస్ IV ఫిబ్రవరి 12–16, 2024 వరకు షెడ్యూల్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పనిదినాల కోసం ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారానికి సంబంధించిన సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా ఎస్‌జీబీ ధర భారతీయ కరెన్సీలో నిర్ణయిస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి