Gold Bond: ఆఫర్‌ను వదులుకోకండి.. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇదే చివరి అవకాశం..
Sovereign Gold Bond Scheme 2023-24 Series II: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 రెండవ సిరీస్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చివరి రోజు. దీని ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923. ఆన్‌లైన్ చెల్లింపుపై గ్రాముకు రూ.50 తగ్గింపు ఇస్తున్నారు. అంటే మీరు 10 గ్రాముల బంగారం తీసుకుంటే రూ. 500 వరకు తగ్గింపు లభిస్తుంది. మీ వద్ద డబ్బులు ఉంటే వెంటనే గోల్డ్ బాండ్ మీద పెట్టుబడిపెట్టవచ్చు, ఎందుకు ఆలస్యం ఎలా కొనాలో ఇక్కడ తెలుసుకుందాం..
బంగారం తక్కువ ధరలో కొనేందుకు చూస్తున్నారా..? చౌక బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి, చివరి అవకాశం. గొన్ని గంటలు మాత్రమే మిగలి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ రెండవ సిరీస్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇవాళ అంటే శుక్రవారం చివరి రోజు. ఈ బాండ్ సెప్టెంబర్ 11న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయ్యింది. దీని ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు. 10 గ్రాముల బంగారం ధర రూ.59,230.
అయితే, సావరిన్ గోల్డ్ బాండ్‌ను ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేస్తుంది. మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని పొందుతారు. పెట్టుబడిదారులు 2.5 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. ఇది ప్రతి 6 నెలలకు చెల్లించబడుతుంది.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే 10 గ్రాముల బంగారం మీరు కొనుగోలు చేస్తే రూ. 500 వరకు తగ్గింపు లభిస్తుంది. వీటి కోసం వారు డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆన్‌లైన్ చెల్లింపు చేసే పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ.5,873గా ఉంటుంది.
మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌ని ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే..
సావరిన్ గోల్డ్ బాండ్లను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ ఆఫీస్, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా విక్రయించబడతాయి. వెంటనే మీరు స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కొనులోగు చేయవచ్చు. లేదా మీకు సమీపంలోని పోస్టాఫీసు నుంచి కూడా గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలు పరిమితి:
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం కింద.. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కనీస పెట్టుబడి ఒక గ్రాము. అదే సమయంలో.. ట్రస్ట్ లేదా ఇలాంటి సంస్థలు 20 కిలోల వరకు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దరఖాస్తులు కనీస పరిమాణంలో 1 గ్రాము, దాని కొలతలలో జారీ చేయబడతాయని గమనించండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కొనేందుకు రెడీ ఉంటే ఆలస్యం చేయకండి.. ఫోన్ తీసుకోండి.
శుక్రవారం బంగారం మార్కెట్ ధరలు..
ఈరోజు బంగారం-వెండి ధరలు పెరిగాయి. నిరంతర క్షీణత తర్వాత.. బంగారం ధర ఇవాళ పెరుగుదలతో ట్రేడవుతోంది. ఇవాళ బంగారం ధర (MCX బంగారం ధర) 58,700 స్థాయిని దాటింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి