AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VerSe Innovation సంస్థలో పీఆర్ రమేష్‌కు కీలక పదవి..

ఏఐ లోకల్ లాంగ్వేజ్ ఫ్లాట్‌ఫామ్ VerSe Innovation కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ పీఆర్ రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ రంగంలో రాణించేందుకు కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి.

VerSe Innovation సంస్థలో పీఆర్ రమేష్‌కు కీలక పదవి..
Ramesh
Venkatrao Lella
|

Updated on: Mar 31, 2026 | 4:05 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఇటీవల వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరగడమే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇక ఏఐ రంగంలో అనేక స్టార్టప్‌లు కూడా కొత్తగా పురుడుపోసుకుంటున్నాయి. ఏఐకు ఉన్న డిమాండ్, క్రేజ్ కారణంగా టెక్ కంపెనీలన్నీ దీనిపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ఫ్లాట్ ఫామ్ VerSe Innovation సంస్థ కూడా ముందడుగు వేసింది. ఏఐని అభివృద్ది చేయడంలో భాగంగా వ్యూహత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన పీఆర్ రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆయనను బోర్డు సభ్యుడిగానే కాకుండా ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించుకుంది.

పీఆర్ రమేష్ ఎవరు..?

సీఏగా పీఆర్ రమేష్‌కు 40 ఏళ్లకకుపైగా అనుభవం ఉంది. డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. డెలాయిట్ గ్లోబల్‌లో బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇక సిప్లా, నెస్లే ఇండియా, ఎయిర్ ఇండియా, ఎల్‌అండ్‌టీ వంటి సంస్థల్లో బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఇక ఆర్బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ వంటి సంస్థల్లో కూడా అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు VerSe Innovation సంస్థ ఆయనను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. దీనినిపై ఆ సంస్థ కో ఫౌండర్ ఉమంగ్ బేడీ మాట్లాడుతూ.. తమ కంపెనీ నిలదొక్కుకోవాలంటే ఆర్ధిక క్రమశిక్షణ అవసరమని, పీఆర్ రమేష్ అనుభవాలు తమకు ఉపయోగపతాయని వ్యాఖ్యానించారు. తమ సంస్థ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. VerSe Innovation సంస్థ స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. జోష్, డైలీహాంట్, నెక్స్ వర్స్, మ్యాగ్జ్ టర్ వంటి యాప్‌లను నిర్వహిస్తోంది. ఇక గూగుల్, మైక్రో సాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉణ్నాయి.

Follow Us