
Vande Bharat Sleeper Rrains: దూర ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఒక పెద్ద అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపడానికి ఇప్పుడు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రైళ్లను రాత్రిపూట ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తారు. BEML, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సంయుక్తంగా ఈ రైళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం రైళ్లను ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే దశల వారిగా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఈ కొత్త రైళ్లకు సంబంధించి రైల్వేలు ఇప్పటికే ఉన్న నియమాలను గణనీయంగా సవరించాయి. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు మెరుగుపర్చారు. కానీ బుకింగ్ ప్రక్రియ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. రైల్వే బోర్డు ప్రకారం.. దూరం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిచారు.
వందే భారత్ స్లీపర్ రైళ్లు వేగం, భద్రతలోనూ రాజధాని రైళ్లను అధిగమిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భద్రత కోసం ఇందులో ‘KAVACH’ వ్యవస్థ, అగ్ని నివారణ కోసం ప్రత్యేక అగ్ని నిరోధక డోర్స్ ఉపయోగించారు. కోచ్ లోపల గాలిని శుభ్రంగా ఉంచడానికి, క్రిములను తొలగించడానికి UV-C దీపాలను ఉపయోగించారు. వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందించారు. అలాగే ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి సౌకర్యవంతమైన మెట్లను నిర్మించారు.
ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి