Mukhymantri Saur Swarojgar Yojana : నిరుద్యోగులకు ఉపాధి లభించాలనే ఉద్దేశ్యంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సౌరశక్తి స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎల్‌ఈడీ లైట్లు, సోలార్ ప్లాంట్ల తయారీ ద్వారా లక్షలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు స్వయం సహాయక బృందాలలో చేరాలి. పేరు నమోదు చేసుకోవాలి. ప్రతిగా వ్యాపారం కోసం ప్రభుత్వం మీకు రుణం అందిస్తుంది. వివరాలు తెలుసుకోండి.
ఈ పథకం కింద మహిళల అభివృద్ధికి అధిక ప్రాముఖ్యతనిస్తోంది. తద్వారా వారు వారి జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వలస వచ్చినవారికి ఆర్థిక సహాయం అందించడం ముఖ్యమంత్రి సౌరశక్తి స్వయం ఉపాధి పథకం లక్ష్యం.
ఈ పథకం మహిళలు, చిన్న ఉపాంత రైతులు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వ్యాపారం ప్రారంభించడంలో డబ్బు సమస్యను ప్రభుత్వం అధిగమిస్తుంది. ఇందుకోసం సౌరశక్తికి సంబంధించిన పరికరాల తయారీ, కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.
1. ఈ పథకంలో లబ్ధిదారుడు వ్యాపారం మొత్తం వ్యయంలో 70 శాతం రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకు నుంచి ఎనిమిది శాతం వడ్డీ చొప్పున రుణంగా తీసుకోవచ్చు.
2. ఈ పథకం కింద ఒకటిన్నర నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్టును పెట్టడం ద్వారా స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు.
3. ముఖ్యమంత్రి సౌరశక్తి స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం15 ఏళ్లకు రుణ సౌకర్యం కల్పిస్తోంది.
4. ఇందులో ఈ గ్రాంట్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో 30 శాతం వరకు, కొండ జిల్లాల్లో 25 శాతం వరకు, ఇతర జిల్లాల్లో 15 శాతం వరకు ఉంటుంది.
5. పథకం ప్రయోజనాన్ని పొందడానికి దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
6. ఈ పథకంలో ఒక వ్యక్తికి ఒక సౌర విద్యుత్ ప్లాంట్ మాత్రమే కేటాయించబడుతుంది.