Gold Prices: గోల్డ్‌ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణమిదే.!

|

Sep 12, 2024 | 5:25 PM

దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని సంకేతాలు వస్తుండటంతో..

Gold Prices: గోల్డ్‌ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణమిదే.!
Gold Rates
Follow us on

దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని సంకేతాలు వస్తుండటంతో.. మళ్లీ బంగారం, వెండికి డిమాండ్ పెరగవచ్చునని వారి భావన.  అమెరికా కార్మికశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 2.5 శాతంగా ఉంది. గడిచిన ఏడాదితో పోలిస్తే 1 శాతం మాత్రమే పెరిగింది. గత మూడేళ్లలో ఇంత స్వల్పంగా పెరగడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను కూడా తగ్గించే ఛాన్స్ ఉండటంతో.. దీని ప్రభావం బంగారం, వెండిపై పడుతుంది.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చేవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్.. ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించారు. ఇక ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగినా, తగ్గినా.. వడ్డీ రేట్ల తగ్గింపునకు మరోసారి సిద్ధమని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ సూచించారు. వచ్చే వారం వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం..

కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గిస్తే, మరోసారి ఈ రెండింటికి డిమాండ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్లు బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చు. గతంలోనూ ఇదే జరిగింది. ఈసారి కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గితే, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుతాయి. డాలర్ కరెన్సీ కూడా బలహీనపడవచ్చు. దీంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావన.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..