AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI System Upgrade: ఇప్పుడు యూపీఐ ద్వారా వేగంగా డబ్బు పంపవచ్చు.. త్వరలో కొత్త అప్‌డేట్!

UPI System Upgrade: లావాదేవీల జాప్యం, నెట్‌వర్క్ సమస్యల కారణంగా డబ్బు పంపలేకపోవడం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఈ సమస్యలను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త మార్పును ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది..

UPI System Upgrade: ఇప్పుడు యూపీఐ ద్వారా వేగంగా డబ్బు పంపవచ్చు.. త్వరలో కొత్త అప్‌డేట్!
Subhash Goud
|

Updated on: May 03, 2025 | 7:48 PM

Share

UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వ్యవస్థ భారతదేశంలో డబ్బు బదిలీలను చాలా సులభతరం చేసింది. ఈ పద్ధతికి బ్యాంకు ఖాతాలు, IFSC నంబర్లు మొదలైనవి అవసరం లేదు. కేవలం ఒక క్లిక్‌తో డబ్బు మనం పంపాలనుకుంటున్న వ్యక్తులకు చేరుతుంది. మీరు దీనితో కిరాణా దుకాణాల నుండి షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా చెల్లించవచ్చు. కానీ దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. లావాదేవీల జాప్యం, నెట్‌వర్క్ సమస్యల కారణంగా డబ్బు పంపలేకపోవడం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఈ సమస్యలను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త మార్పును ప్రవేశపెట్టబోతోంది.

UPI వ్యవస్థలో రాబోయే మార్పులు:

ప్రస్తుతం లావాదేవీల స్థితిని తనిఖీ చేయడానికి, రివర్సల్స్ చేయడానికి 30 సెకన్లు పడుతుంది. కానీ బిజినెస్ టుడేలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, కొత్త మార్పు తర్వాత ఇది కేవలం 10 సెకన్లకు తగ్గనుంది. దీని వలన డబ్బు పంపడం, స్వీకరించడం ఇకపై నెమ్మదించదు. లావాదేవీ వేగంగా జరుగుతుంది. అందుకే యూపీఐ వినియోగదారులకు మెరుగైన అనుభవం ఉంటుంది.

సెకన్లలో డబ్బు పంపండి:

ఈ మార్పులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్‌లో వివరంగా ఉంది. దీని ప్రకారం.. డబ్బు పంపడం, స్వీకరించడం ప్రక్రియ 30 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గనుంది. లావాదేవీలను ధృవీకరించే సమయం కూడా 15 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గించబడుతుంది. భారతదేశంలో UPI వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఈ మార్పులు రూపొందించారు. ఈ కొత్త మార్పు జూన్ 16, 2025 నుండి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ సర్వీస్ పై జీఎస్టీ?

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో UPI వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఈ పద్ధతి ద్వారా జరిగే అన్ని నగదు లావాదేవీలకు ఎటువంటి రుసుము వసూలు చేయదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1000 దాటిన లావాదేవీలపై 18 శాతం జిఎస్‌టి విధించాలని పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ పేజీలో ఖండించింది. ఇది అబద్దమని స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..