UPI Transactions: బ్యాంకింగ్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న యూపీఐ.. దాదాపు 10 బిలియన్ల లావాదేవీలతో రికార్డు..
వీధి వ్యాపారుల దగ్గర నుంచి బడా షాపింగ్ మాల్స్ వరకూ యూపీఐ లావాదేవీలు లేని కాంప్లెక్స్ లు కనపడటం లేదు. దీంతో లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. జూలైలో 9.96 బిలియన్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. జూన్ లో ఇది 9.43 బిలియన్లుగా ఉండగా ఏకంగా ఏడు శాతం అధిక లావాదేవీలు నమోదయ్యాయి. జూలైలో ఈ లావాదేవీలన్నీ కలిపి మొత్తం రూ. 15.34 ట్రిలియన్లుగా నమోదైంది.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) దేశం బ్యాంకింగ్ రంగ రూపురేఖలను మార్చేసింది. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, లేదా ఏటీఎంల ను వినియోగించుకునే పరిస్థితి నుంచి చేతిలో రూపాయి లేకుండా.. కేవలం సెల్ ఫోన్ తో ఎక్కడికైనా వెళ్లి ఎంచక్కా షాపింగ్ చేసి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. డిజిటల్ బాటలో ఇదో నూతన ఒరవడిని సృష్టించిందని చెప్పాలి. వీధి వ్యాపారుల దగ్గర నుంచి బడా షాపింగ్ మాల్స్ వరకూ యూపీఐ లావాదేవీలు లేని కాంప్లెక్స్ లు కనపడటం లేదు. దీంతో లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. జూలైలో 9.96 బిలియన్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. జూన్ లో ఇది 9.43 బిలియన్లుగా ఉండగా ఏకంగా ఏడు శాతం అధిక లావాదేవీలు నమోదయ్యాయి. జూలైలో ఈ లావాదేవీలన్నీ కలిపి మొత్తం రూ. 15.34 ట్రిలియన్లుగా నమోదైంది. ఇదే జూన్ నెలలో అయితే రూ. 14.75 ట్రిలియన్లు నమోదుకాగా, ఇప్పుడు 4శాతం అధికంగా లావాదేవీలు సాగాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్పీసీఐ చెబుతున్న లెక్కలు ఇవే..
- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) షేర్ చేసిన డేటా ప్రకారం, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే లావాదేవీ పరిమాణం 58 శాతం, విలువ 44 శాతం పెరిగింది. జూలై 2022లో రూ.10.63 ట్రిలియన్ల విలువతో 6.3 బిలియన్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. మే 2023లో దాదాపు 9.41 బిలియన్ల వాల్యూమ్‌తో రూ. 14.31 ట్రిలియన్ల లావాదేవీలు జరిగాయి.
- అలాగే జూలై 2023లో, ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలు వాల్యూమ్‌లో 468.1 మిలియన్ల నుంచి 5 శాతం పెరిగి 490 మిలియన్లకు చేరుకున్నాయి. విలువ పరంగా, ఇది జూన్‌లో రూ. 5 ట్రిలియన్ల నుంచి 2.4 శాతం పెరిగి జూలైలో రూ. 5.12 ట్రిలియన్లకు చేరుకుంది. జూలై 2022తో పోలిస్తే, ఇది వాల్యూమ్‌లో 7 శాతం, విలువలో 15 శాతం పెరిగింది. మేలో, ఇది విలువ పరంగా రూ. 5.26 ట్రిలియన్లు, పరిమాణంలో 500 మిలియన్లు. ఏప్రిల్ 2023లో, ఇది వరుసగా రూ. 5.21 ట్రిలియన్, 496 మిలియన్లు.
- ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల విషయానికొస్తే, జూన్‌లో 316 మిలియన్లుగా ఉన్న వాల్యూమ్ పరంగా ఈ నెల 7 శాతం క్షీణతతో జూలైలో 295 మిలియన్లకు చేరుకుంది. జూన్‌లో రూ.5,196 కోట్ల నుంచి జులైలో రూ.4,981 కోట్లకు 4 శాతం తగ్గింది. జూలై 2022తో పోల్చితే ఈ విభాగంలో 11 శాతం వాల్యూమ్ వృద్ధి, 20 శాతం విలువ పెరుగుదల కనిపించింది. ఆసక్తికరంగా, మేతో పోల్చినప్పుడు, జూలై గణాంకాలు వాల్యూమ్‌లో 12 శాతం, విలువలో 8 శాతం తగ్గాయి. మేలో రూ. 5,437 కోట్లతో 335 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
- ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎప్) జూన్‌లో 96 మిలియన్ల నుంచి 109 మిలియన్లకు 14 శాతం పెరిగింది. విలువ పరంగా ఇది 11 శాతం పెరిగి రూ.26,526 కోట్ల నుంచి రూ.29,471 కోట్లకు చేరుకుంది. జూన్ సంఖ్యలు వాల్యూమ్, విలువలో వరుసగా 1 శాతం, 2 శాతం తగ్గాయి. మే నెలలో రూ.28,037 కోట్ల విలువైన 99.6 మిలియన్ లావాదేవీలు జరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..