UPI Payment: ఏప్రిల్ 1 నుండి ఈ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఇక చెల్లింపులు చేయలేరు!
UPI Payment: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూపీఐ సేవలు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ సేవలను నిలిపివేయనుంది. అలాంటి వారు ఎలాంటి యూపీఐ లావాదేవీలు చేయలేరు..

UPI వినియోగదారుల కొత్త నియమాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తున్నాయి. ఇది Google Pay, PhonePe, Paytm వంటి చెల్లింపు యాప్‌ల వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చాలా కాలంగా మూసివేసిన UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లను బ్యాంక్ ఖాతా నుండి తొలగిస్తామని తెలిపింది. మీ బ్యాంక్ ఖాతాకు వాడుకలో లేని ఫోన్ నంబర్‌తో లింక్ చేసినట్లయితే అది తొలగించనున్నారు. దీని తరువాత వాడుకలో లేని ఫోన్ నంబర్ ద్వారా UPI లావాదేవీలు చేయడం సాధ్యం కాదు.
సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్త నిబంధన
గత కొంత కాలంగా దేశంలో సైబర్ నేరాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ దృష్ట్యా, NPCI కొత్త నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నిలిచిపోయిన ఫోన్ నంర్ల ద్వారా UPI, బ్యాంకింగ్ వ్యవస్థలలో సాంకేతిక లోపాలకు కారణమవుతాయని NPCI చెబుతోంది. టెలికాం ఆపరేటర్లు ఇతర వినియోగదారులకు నిలిచిపోయిన నంబర్లను కేటాయిస్తారు. ఇది మోసానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు ప్రతి వారం నిష్క్రియ మొబైల్ నంబర్ల రికార్డును సవరించాలని NPCI బ్యాంకులు, UPI యాప్‌లను కోరింది.
ఈ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమవుతారు:
కొత్త మొబైల్ నంబర్ తీసుకున్నా వారి బ్యాంక్ ఖాతా ఇప్పటికీ పాత నంబర్‌తోనే లింక్ చేయబడిన వినియోగదారులపై ఈ నిర్ణయం అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాట యాక్టివ్ లేని మొబైల్ నంబర్లతో UPI ఉపయోగిస్తున్న వినియోగదారులు కూడా ఈ నిర్ణయం కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. మీ బ్యాంక్ ఖాతా పాత నంబర్‌కు లేదా ఇకపై యాక్టివ్‌గా లేని నంబర్‌కు లింక్ చేయబడి ఉంటే, మీ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో అప్‌డేట్ చేయండి. అలాగే, మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ద్వారా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. మీ నంబర్ యాక్టివేట్ అయిన తర్వాత ఏప్రిల్ 1 తర్వాత కూడా మీరు మునుపటిలాగానే UPI సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Petrol, Diesel Tax: దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఏ రాష్ట్రాల్లో ఎంత?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి