Royal Enfield Bikes: 2024లో లాంచ్ కానున్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ఇవే.. జాబితా కొంచెం పెద్దదే!
పాత కాలం నుంచి ఉన్న బ్రాండ్ కావడం, లేటెస్ట్ మోడల్స్ యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. దీనిలో ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎప్పుడు ఏ మోడల్ లాంచ్ అయినా మార్కెట్ వర్గాల్లో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల్లోకొత్త సంవత్సరం రానుంది. 2024లో కొన్ని కొత్త మోడళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ పేరుకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. పాత కాలం నుంచి ఉన్న బ్రాండ్ కావడం, లేటెస్ట్ మోడల్స్ యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. దీనిలో ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎప్పుడు ఏ మోడల్ లాంచ్ అయినా మార్కెట్ వర్గాల్లో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల్లోకొత్త సంవత్సరం రానుంది. 2024లో కొన్ని కొత్త మోడళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. వాటిల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650, రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450 వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650..
దాదాపు రెండు వారాల క్రితం, రాయల్ ఎన్‌ఫీల్డ్ యునైటెడ్ స్టేట్స్‌లో ప్రొడక్షన్-స్పెక్ షాట్‌గన్ 650ని ఆవిష్కరించింది. ఇది వచ్చే నెలలో మనదేశంలో విక్రయాలకు వచ్చే అవకాశం ఉంది. ఎస్‌జీ650 సూపర్ మెటోర్ 650 ఫ్లాగ్‌షిప్ క్రూయిజర్ కింది స్లాట్ చేసి ఉంటుంది. దీనిని సూపర్ మెటోర్‌తో పోలిస్తే చిన్న చక్రాలు, విభిన్న గేరింగ్, హ్యాండిల్ బార్, కొత్త బాడీ ప్యానెల్‌లు మొదలైనవి కలిగి ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350..
చెన్నైకి చెందిన తయారీదారు గోవాన్ క్లాసిక్ 350 పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఇది ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్ లేదాబాబర్ స్టైల్డ్ మోటార్ సైకిల్ గా గానీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి అనేకసార్లు దీనిని పరీక్షిస్తుండగా గుర్తించారు. మోటోవెర్స్ లో షాట్‌గన్ 650 ఫ్యాక్టరీ కస్టమ్ వెల్లడించినట్లే, గోవాన్ క్లాసిక్ 350 కూడా ఈ ప్రదేశానికి పరిమితం చేయవచ్చు. దీనిలో తొలగించగల వెనుక సీటు, వైట్‌వాల్ టైర్లు, పెరిగిన హ్యాండిల్‌బార్, కొంచెం ముందుకు సెట్ చేసిన ఫుట్‌పెగ్‌లతో ఉంటుంది. కూడిన బాబర్ క్లాసిక్ 350ల శ్రేణిని విస్తరించడంలో సహాయపడుతుంది మరియు ఇది 2024లో వేరే పేరును కలిగి ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450..
దీనిని కూడా ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450ను ఇటీవల విడుదల చేసిన హిమాలయన్ 450 కన్నా మరింత హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ గా దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాలయన్ 450ని ర్యాలీ ఎడిషన్‌లో ఫ్లాట్ సీట్, విభిన్న టెయిల్ సెక్షన్‌తో ప్రదర్శించింది. యారో ఎగ్జాస్ట్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650..
650 సీసీ బైక్ శ్రేణిలో ఇది చాలా ప్రత్యేకత కలినది. దీనిలో టూ-ఇన్-వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి విలక్షణమైన లక్షణాలు ఉన్నాయి. బ్లాక్ ప్యాటర్న్ టైర్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పొడిగించిన వీల్‌బేస్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది 648 సీసీ పారలల్-ట్విన్ ఇంజన్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఈ బైక్ ని 2024 చివరిలో గ్లోబల్ వైడ్ గా అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450..
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 450 సీసీ లైనప్‌ను సరికొత్త రోడ్‌స్టర్‌ను ప్రారంభించడం ద్వారా విస్తరించాలని యోచిస్తోంది. ఇది రాబోయే సంవత్సరంలో విడుదల కానుంది. ఈ మోడల్ ట్రయంఫ్ స్పీడ్ 400తో పోటీ పడుతుందని అంచనా వేస్తున్నారు. 452సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ డీఓహెచ్సీ నాలుగు-వాల్వ్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఇది 40.02 పీఎస్, 40ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..