Business Idea: చిన్న షటర్ ఉంటే చాలు.. నెలకు రూ. 50 వేల సంపాదన.. ఎలాగంటే..
ఆదాయం విషయానికొస్తే.. ప్రతీ నగదు ట్రాన్సాక్షన్‌పై రూ. 8, నగదు రహిత లావాదేవీలపై రూ. 2 వస్తాయి. ఉదాహరణకు ఏటీఎమ్ ద్వారా నెలకు 250 లావాదేవీలు జరిగితే వీటిలో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగినా నెలకు రూ.45 వేల ఆదాయం వస్తుంది. లావాదేవీల సంఖ్య ఆధారంగా ఆదాయం పెరుగుతుంది...

వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ నష్టం ఉంటుందేమోనన్న భావనతో చాలా మంది వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి సంశయిస్తుంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాల్లో నష్టం అనేది ఉండదు. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో ఏటీఎమ్ ఫ్రాంచైజ్ ఒకటి. ఇటీవలి కాలంలో ఏటీఎమ్ ఫ్రాంచైజ్ మంచి వ్యాపార అవకాశంగా మారింది. ఇంట్లో కూర్చొని, ఎలాంటి పనిచేయకుండానే డబ్బులు సంపాదించే అవకాశం ఈ ఏటీఎమ్ ఫ్రాంచైజ్ కల్పిస్తోంది.
ఇంతకీ ఏటీఎమ్ ఫ్రాంచైజ్‌ను ఎలా తీసుకోవాలి.? ఇందుకు ఉండాల్సిన అంశాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎమ్ ఫ్రాంచైజ్‌ను ఏర్పాటు చేయాలంటే.. కనీసం 50-80 చదరపు అడుగుల ఒక షటర్ ఉండాలి. షటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండాలి. కచ్చితంగా కాంక్రీట్ రూఫ్ ఉండాలి. మరో ఏటీఎం నుంచి కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. అలాగే విద్యుత్ సరఫరాతో పాటు 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. ఏటీఎమ్‌లో రోజుకు కనీసం 300 లావాదేవీలు జరగాలి.
ఇక ఏటీఎమ్ ఫ్రాంచైజ్‌కు అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల డాక్యుమెంట్స్ ఉండాలి. అవేంటంటే.. ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు లేదా ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌తో పాటు పాస్‌బుక్ కలిగిఉండాలి. దరఖాస్తు దారుని ఫొటోగ్రాఫ్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌తో పాటు జీఎస్టీ నెంబర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు ఉండాలి.
ఇక ఏటీఎం ఫ్రాంచైజ్‌ను ఆన్‌లైన్‌లో ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎమ్ ఇన్‌స్టాలేషన్ సేవలను టాటా ఇండికాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం కంపెనీలు దేశంలో ఏటీఎంలు అందిస్తున్నాయి. సదరు కంపెనీలకు చెందిన వెబ్‌సైట్స్‌లో ఏటీఎమ్ ఫ్రాంఛైజ్ ద్వారా ఏటీఎమ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఏటీఎమ్ ఫ్రాంఛైజ్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే మొత్తం రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటిలో రూ. 2 లక్షలు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కాగా, రూ. 3 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ డిపాజిట్ చేయాలి.
ఆదాయం విషయానికొస్తే.. ప్రతీ నగదు ట్రాన్సాక్షన్‌పై రూ. 8, నగదు రహిత లావాదేవీలపై రూ. 2 వస్తాయి. ఉదాహరణకు ఏటీఎమ్ ద్వారా నెలకు 250 లావాదేవీలు జరిగితే వీటిలో 65 శాతం నగదు లావాదేవీలు, 35 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగినా నెలకు రూ.45 వేల ఆదాయం వస్తుంది. లావాదేవీల సంఖ్య ఆధారంగా ఆదాయం పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..