బ్యాంక్‌కు వెళ్లకుండానే… నిమిషాల్లో రుణం… రూ.15 లక్షల వరకు…!

బ్యాంక్‌కు వెళ్లకుండానే... నిమిషాల్లో రుణం... రూ.15 లక్షల వరకు...!

లోన్ కావాలంటే గతంలో మాదిరిగా బ్యాంకుకే వెళ్లి లోన్ తీసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆన్‌లైట్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోయాయి. ఇంట్లో కూర్చొనే రుణం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.15 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అది కూడా తక్షణమే లోన్‌ను మంజూరు చేస్తున్నాయి. ఆన్‌లైన్ రుణాలు అందిస్తున్న పలు లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ గురించి వివరంగా… Qbera: స్వయం ఉపాధి పొందుతున్న వారు బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 16, 2019 | 4:41 PM

లోన్ కావాలంటే గతంలో మాదిరిగా బ్యాంకుకే వెళ్లి లోన్ తీసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆన్‌లైట్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోయాయి. ఇంట్లో కూర్చొనే రుణం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.15 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అది కూడా తక్షణమే లోన్‌ను మంజూరు చేస్తున్నాయి. ఆన్‌లైన్ రుణాలు అందిస్తున్న పలు లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ గురించి వివరంగా…

Qbera: స్వయం ఉపాధి పొందుతున్న వారు బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. క్యూబెరా ద్వారా సులభంగా కొన్ని క్లిక్స్‌తో వేగంగా రుణం పొందొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ రూ.లక్ష దగ్గరి నుంచి రూ.15 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. ఉద్యోగం చేసే వారు కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

MoneyTap: మనీట్యాప్ ప్లాట్‌ఫామ్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాన్ని అందిస్తుంది. అయితే మనం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా స్వల్పకాలిక రుణాలను మాత్రమే పొందగలం. మినిమమ్ డాక్యుమెంట్లతో కొన్ని గంటలోనే లోన్ లభిస్తుంది. రుణాన్ని సులభ ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారు, ఉద్యోగులు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

HAPPY: చిన్న వ్యాపారులు రుణం కోసం హ్యాపీ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌పామ్ ఇప్పుడు కన్సూమర్ లోన్స్ కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో ఈ ప్లాట్‌ఫామ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

InCred: ఇన్‌క్రెడ్ కొత్త ఎన్‌బీఎఫ్‌సీ ప్లాట్‌ఫామ్. ఇది బిజినెస్, కన్సూమర్ లోన్స్‌ను అందిస్తుంది. పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఎస్ఎంఈ బిజినెస్ లోన్, టూవీలర్ లోన్ వంటి రుణాలను పొందొచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన లోన్ ప్రొడక్ట్‌ను అందించడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu