AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Rates Hike: డిపాజిటర్లకు ఆ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీ పెంపు

బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్‌ను గణనీయంగా పెంచుతుంది. ఈ రెపొ రేట్ పెంపు వల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్‌ను పెంచుతున్నాయి.

FD Rates Hike: డిపాజిటర్లకు ఆ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీ పెంపు
Fixed Deposits
Nikhil
|

Updated on: Feb 17, 2023 | 12:55 PM

Share

జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఎలాంటి రిస్క్ లేకుండా చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. పెట్టుబడికి భరోసాతో పాటు కచ్చితమైన రాబడి ఉండడంతో అందరూ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు లేదా రిటైరైన వారు తాము సంపాదించిన సొమ్ముపై వచ్చే వడ్డీతో జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు వారసులకు ఇవ్వడంతో పాటు కష్ట సమయంలో ఆదుకుంటుందనే నమ్మకం. బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్‌ను గణనీయంగా పెంచుతుంది. ఈ రెపొ రేట్ పెంపు వల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్‌ను పెంచుతున్నాయి. నేషనలైజ్డ్‌ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కస్టమర్లకు ఎక్కువ వడ్డీనిస్తాయి. తాజాగా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వినియోగదారులకు ఎఫ్‌డీలపై గణనీయంగా వడ్డీ రేట్‌ను పెంచింది. 

రెండు కోట్ల లోపు డిపాజిట్ల వరకూ 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ బ్యాంకులో రెండు కోట్ల లోపు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు 9.00 శాతం వడ్డీ ఇస్తామని పేర్కొంది.  అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం 9.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే ఈ స్థాయి వడ్డీని పొందాలంటే కచ్చితంగా 1001 రోజులపాటు సొమ్మును డిపాజిట్ చేయాలని షరత్తు మాత్రం పెట్టింది. అయితే 180-201, 501 రోజుల డిపాజిట్‌కు అయితే సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం, సాధారణ డిపాజిటర్లకు 8.75 శాతం వడ్డీని అందిస్తామని పేర్కొంది. అలాగే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వివిధ కాలపరిమితి బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 90-180 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75 శాతం, 202-364 రోజుల్లో మెచ్యూరయ్యే  డిపాజిట్లకు 6.75 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తుంది. 365-501 రోజులకు 7.35 శాతం, 18 నెలల నుంచి 1000 రోజులకు 7.40 శాతం వడ్డీ వస్తుంది. అయితే 1002 రోజుల నుంచి 5 ఏళ్లల్లో మెచ్యూరయ్యే డిపాజిట్లకు మాత్రం 7 శాతం వడ్డీ రానుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..