Budget 2024: రూ. 15 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుందా?

|

Jun 25, 2024 | 6:05 PM

Union Budget 2024: రానున్న కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నును సవరిస్తారనే వార్తలకు రెక్కలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, సంవత్సరానికి రూ. 15 లక్షల వరకు ఆదాయానికి పన్ను రేటు తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు ఖండించారు. ఆదాయంపై పన్నును ఈ స్థాయికి తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ..

Budget 2024: రూ. 15 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుందా?
Budget 2024
Follow us on

Union Budget 2024: రానున్న కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నును సవరిస్తారనే వార్తలకు రెక్కలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, సంవత్సరానికి రూ. 15 లక్షల వరకు ఆదాయానికి పన్ను రేటు తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు ఖండించారు. ఆదాయంపై పన్నును ఈ స్థాయికి తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం అటువంటి చర్య తీసుకోదని ఒక ప్రభుత్వ అధికారి తమతో చెప్పినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వార్తా సంస్థ నివేదించింది. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు ఆదాయం 20 శాతం వరకు పన్ను స్లాబ్ రేట్లు ఉన్నాయి. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, పన్ను మొత్తం 30 శాతం ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం 20 శాతం, 30 శాతం పన్నుతో స్లాబ్‌లలో రేటు సవరణ ఉండవచ్చు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: SBI: కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త.. అదేంటో తెలుసా..?

కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం ఉన్న రేట్ల వివరాలు:

  • రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
  • రూ. 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయం: 5 శాతం పన్ను విధింపు
  • రూ. 6 నుండి 9 లక్షల మధ్య ఆదాయం: 10 శాతం
  • రూ. 9 నుండి 12 లక్షల మధ్య ఆదాయం: 15 శాతం
  • రూ. 12 నుండి 15 లక్షల మధ్య ఆదాయం: 20 శాతం
  • రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం: 30 శాతం
  • ఇక్కడ రూ.7 లక్షల వరకు ఆదాయానికి పన్ను రాయితీ ఉంది. అదనంగా రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. మీ జీతం రూ. 7.5 లక్షల లోపు ఉంటే మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: మీరు రూ.400ల ఫుడ్ ఆర్డర్ చేస్తే జోమాటోకు ఎంత లాభం వస్తుందో తెలుసా?

పాత పన్ను విధానంలో పన్ను రాయితీ అనుమతి లేదు. అక్కడ మీకు పన్ను మినహాయింపు అవకాశాలు ఉన్నాయి. సెక్షన్ 80C రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఎన్‌పీఎస్‌, మెడికల్ ఇన్సూరెన్స్ చేయడం ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్‌ వంటి పథకాలు సెక్షన్ 80C కిందకు వస్తాయి. ఇదిలా ఉండగా, జూలై 22 లేదా ఆ నెల చివరి వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ శాఖలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Paytm Wallet: మీరు పేటీఎం వాడుతున్నారా? జూలై 20 నుంచి వాలెట్‌ మూసివేత

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి