AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: రెండు దశల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం పార్లమెంట్‌లో..

Budget 2023: రెండు దశల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..
Union Budget 2023 -24
Subhash Goud
|

Updated on: Jan 30, 2023 | 5:18 PM

Share

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీని తరువాత ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఐదవ, చివరి పూర్తి బడ్జెట్. బడ్జెట్‌ సమర్పణ అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ సమావేశాల మొదటి రోజున మొదటిసారి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 13 నాటికి మొదటి దశ

బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు సెలవు ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్ల డిమాండ్‌పై చర్చించి నివేదికలు సిద్ధం చేస్తాయి. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఆర్థిక బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగనుంది. చర్చల అనంతరం ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..