Bank Rules: ఆ బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఇలా చేయకపోతే విత్‌డ్రాయల్స్ కష్టమే.!

ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకులు రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే..

Bank Rules: ఆ బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఇలా చేయకపోతే విత్‌డ్రాయల్స్ కష్టమే.!
Union Bank Of India

Updated on: Jul 02, 2021 | 8:14 AM

ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకులు రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అకౌంట్, ఇతరత్రా లావాదేవీల వ్యవహారాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సమాచారాన్ని ఇచ్చింది. కొత్త సెక్యూరిటీ ఫీచర్లు అమలులోకి వచ్చాయని.. పాత చెక్కులన్నీ కూడా జూలై 1వ తేదీ నుంచి పని చేయవని స్పష్టం చేసింది.

2020 ఏప్రిల్ 1న ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్.. రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి విలీనం అయ్యాయి. అందువల్ల ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారిపోయిన విషయం విదితమే. ‘ఆర్‌బీఐ సూచనల మేరకు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ జారీ చేసిన పాత చెక్ బుక్స్ జూలై 1 నుంచి పనిచేయవు. కస్టమర్లందరూ కూడా పాత చెక్‌బుక్‌ల బదులు కొత్త చెక్ పుస్తకాలను దగ్గరలోని బ్రాంచుల నుంచి పొందాలని సూచించింది.

పాత చెక్‌ల నుంచి చెల్లింపులు జరగవు..

ఎవరైనా కస్టమర్ పాత చెక్‌బుక్ నుండి చెక్ జారీ చేసినట్లయితే, వారు దానిని వెంటనే కొత్త చెక్కుతో భర్తీ చేయాలి. కొత్త చెక్‌ను జారీ చేయడం చాలా అవసరం లేదంటే.. మీ చెల్లింపులు ఆగిపోతాయి.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!