AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhim App Offers: బీమ్ యాప్‌లో నమ్మలేని క్యాష్ బ్యాక్ ఆఫర్స్.. ఏకంగా రూ.750 వరకూ లాభం

నిరంతర సేవల కోసం చాలా మంది బీమ్ యాప్‌ను వాడుతున్నారు. అయితే తాజాగా బీమ్ యాప్‌లో కూడా ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ మాత్రం పరిమిత కాలం మాత్రమే ఉంటుందని గమనించాలి. పలు ఆఫర్స్‌లో భాగంగా రూ.750 వరకూ బీమ్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. ఈ నేపథ్యంలో బీమ్ యాప్ ద్వారా రూ.750 క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం. 

Bhim App Offers: బీమ్ యాప్‌లో నమ్మలేని క్యాష్ బ్యాక్ ఆఫర్స్.. ఏకంగా రూ.750 వరకూ లాభం
Bhim
Nikhil
|

Updated on: Feb 11, 2024 | 4:15 PM

Share

భారతదేశంలో యూపీఐ చెల్లింపులు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు చిల్లర సమస్యను తీర్చేశాయి. నోట్ల రద్దు సమయంలో ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ సేవలను ఇతర యాప్స్ సాయంతో ముందుకెళ్లాయి. ఆ సమయంలో ఎన్‌పీసీఐ బీమ్ యాప్‌ను లాంచ్ చేసింది. అయితే ఇతర యాప్స్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఆయా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. అయితే నిరంతర సేవల కోసం చాలా మంది బీమ్ యాప్‌ను వాడుతున్నారు. అయితే తాజాగా బీమ్ యాప్‌లో కూడా ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ మాత్రం పరిమిత కాలం మాత్రమే ఉంటుందని గమనించాలి. పలు ఆఫర్స్‌లో భాగంగా రూ.750 వరకూ బీమ్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. ఈ నేపథ్యంలో బీమ్ యాప్ ద్వారా రూ.750 క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం. 

రూ.150 నుంచి రూ.600 వరకూ ఇలా

భోజనం చేసినప్పుడు లేదా ప్రయాణం చేసినప్పుడు చెల్లింపులను బీమ్ యాప్ ద్వారా చేస్తే రూ. 150 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆహారం మరియు ప్రయాణ ఖర్చుల కోసం రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేస్తే ప్రతిసారీ ఫ్లాట్ రూ. 30 క్యాష్‌బ్యాక్‌ను పొందండి. అలాగే రైల్వే టిక్కెట్‌లను బుక్ చేసుకున్నా, క్యాబ్ రైడ్‌లు చేసినా, బిజినెస్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా రెస్టారెంట్ బిల్లులు చెల్లించినా మీరు రూ. 150 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇలా కనీసం ఐదుసార్లు ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 

రూపే కార్డు లింక్ చేస్తే మరిన్ని ఆఫర్లు

రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ కార్డ్‌లను బీమ్ యాప్‌కి లింక్ చేసి రూ. 600 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ప్రతి నెల రూ. 200 దాటిన 10 లావాదేవీలపై అదనంగా రూ. 30 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. రూ. 600 క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను పూర్తిగా ఆస్వాదించడానికి ఈ లావాదేవీలన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

ఇందన చెల్లింపులు

బీమ్ యాప్ ఉర్జా 1 శాతం పథకాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ సహా అన్ని ఇంధన చెల్లింపులపై ఫ్లాట్ 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతేకాకుండా లావాదేవీ మొత్తం రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే విద్యుత్, నీరు, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. బీమ్ యాప్‌తో లింక్ చేసిన మీ ప్రాథమిక బ్యాంక్ ఖాతాకు నేరుగా క్రెడిట్ చేయబడిన క్యాష్‌బ్యాక్ సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. అయితే  బీమ్ యాప్‌లో ఈ ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి