AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Splendor Plus: పాత బండి ఇవ్వండి.. కొత్త హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ తీసుకెళ్లండి.. సూపర్‌ డీల్..

హీరో స్ల్పెండర్‌ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్ల్పెండర్‌ ప్లస్‌, స్ల్పెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్, సూపర్ స్ల్పెండర్‌, స్ల్పెండర్‌ సూపర్ ఎక్స్‌టెక్‌. స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ రూ.73,440, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ రూ.79,703, సూపర్ స్ప్లెండర్ రూ.80,756, సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ రూ.85,154 ధరలకు లభిస్తున్నాయి. ఈ ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ మాత్రమే.

Hero Splendor Plus: పాత బండి ఇవ్వండి.. కొత్త హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ తీసుకెళ్లండి.. సూపర్‌ డీల్..
Hero Splendor Plus
Madhu
|

Updated on: Jan 25, 2024 | 9:35 AM

Share

ఒకప్పుడు హీరో హోండా రెండూ కలిసి ఒకే కంపెనీగా ఉన్నప్పుడు స్ల్పెండర్‌ అంటే ఫుల్‌ డిమాండ్‌. మంచి ఫ్యామిలీ ద్విచక్రవాహనంగా పేరు గడించింది. మంచి స్పెసిఫికేషన్లు, పనితీరుతో పాటు మైలేజీనిస్తూ.. తక్కువ ధరతో లభ్యమవుతుండటంతో అందరూ ఈ బైక్‌ని ఇష్టపడేవారు. ఆ తర్వాత కాలంలో హీరో, హోండా రెండూ విడిపోవడంతో స్ల్పెండర్‌ బైక్‌ హీరో కంపెనీ పరిధిలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ బైక్‌ వన్నె తగ్గలేదు. మార్కెట్లో అన్ని హీరో బైక్‌లతో పోల్చితే అధిక డిమాండ్‌ దీనికే ఉంటోంది. స్ల్పెండర్‌లో అనేక వేరియంట్లను కూడా హీరో కంపెనీ లాంచ్‌ చేసింది. ప్రస్తుతం నాలుగు విభిన్న వేరియంట్లు మన దేశంలో అందుబాటులో ఉంది, స్ల్పెండర్‌ ప్లస్‌, స్ల్పెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్, సూపర్ స్ల్పెండర్‌, స్ల్పెండర్‌ సూపర్ ఎక్స్‌టెక్‌ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 73,400 నుంచి రూ. 89,232 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ క్రమంలో హీరో కంపెనీ ఈ స్ల్పెండర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది హీరో కంపెనీ. పాత బండిని ఎక్స్‌చేంజ్‌ చేస్తే భారీగా బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. అంతేకాక పలు విధానాలను అవలంభించడం ద్వారా ఈ బైక్‌ ధరను మరింత తగ్గించవచ్చు. అవేంటో చూద్దాం.

ఎక్స్‌ చేంజ్‌ బోనస్‌ పొందడం ఎలా..

హీరో స్ల్పెండర్‌ బైక్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. అందుకోసం మీరు మీ పాత మోటార్‌సైకిల్‌ను మార్చుకోవచ్చు. అయితే కచ్చితంగా కండీషన్లో ఉండాలి. అప్పుడే మంచి రేటు వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైనా పాత బండిని ఎక్స్‌ చేంజ్‌ సమయంలో పాటించవలసిన కొన్ని సూచనలు మీకు అందిస్తున్నాం..

  • మీ పాత మోటార్‌సైకిల్‌ను స్వయంగా తనిఖీ చేయండి. ప్రతిదీ పని చేస్తుందో లేదో చూడండి. అన్ని సక్రమంగా ఉంటేనే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఆమోదయోగ్యంగా ఉంటుంది.
  • మీ సమీపంలోని హీరో డీలర్‌షిప్‌కి వెళ్లండి, అక్కడ వారు మీ పాత మోటార్‌సైకిల్‌ను పరిశీలించి దాని విలువను లెక్కిస్తారు.
  • దాని విలువను నిర్ణయించిన తర్వాత, డీలర్‌షిప్‌లోని అధికారులు కొత్త హీరో స్ప్లెండర్ కొనుగోలుపై అందుబాటులో ఉండే ధర తగ్గింపును మీకు తెలియజేస్తారు

హీరో స్ప్లెండర్ ధర ఎంతంటే..

హీరో స్ల్పెండర్‌ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్ల్పెండర్‌ ప్లస్‌, స్ల్పెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్, సూపర్ స్ల్పెండర్‌, స్ల్పెండర్‌ సూపర్ ఎక్స్‌టెక్‌. స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ రూ.73,440, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ రూ.79,703, సూపర్ స్ప్లెండర్ రూ.80,756, సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ రూ.85,154 ధరలకు లభిస్తున్నాయి. ఈ ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ మాత్రమే.

ఇవి కూడా చదవండి

హీరో స్ల్పెండర్ స్పెసిఫికేషన్స్..

హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ వేరియంట్‌ ఇంజిన్‌ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. దీనిలో 97.2సీసీ బీఎస్‌6 ఇంజిన్‌ ఉంటుంది. దీని పవర్‌ అవుట్‌ పుట్‌ 8బీహెచ్‌పీ, టార్క్‌ 8.05ఎన్‌ఎం ఉంటుంది. మరోవైపు, హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్‌లో 124.70సీసీ, బీఎస్‌6 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10.72 బీహెచ్‌పీ పవర్‌ అవుట్‌పుట్‌, 10.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు