ATM Transactions: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ ఛార్జీలు పెంచుకోవచ్చని బ్యాంకులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తన వినియోగదారులకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు తన ఖాతాదారులకు అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీల ఉపసంహరణ సదుపాయన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు ఏటీఎంలు, బ్యాంకు శాఖల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా అపరిమిత విత్‌డ్రాలు, డిపాజిట్‌లను చేసుకోవచ్చని తెలిపింది. నిన్న సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ సేవను ప్రకటించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ నియమాలను మార్చింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం జూన్‌లో తీసుకోగా, ప్రస్తుతం బ్యాంకులు దీని కోసం గరిష్టంగా రూ.20 వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇక ఆర్థిక లావాదేవీకి రూ.15 నుంచి 17 వరకు, ఆర్థికేతర లావాదేవీలకు రూ.5 నుంచి 6 వరకు ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఆగస్టు 1,2021 నుంచి అమల్లోకి వచ్చాయి.
► మీరు ఏ బ్యాంకు కస్టమర్ అయిన ప్రతి నెల మీ బ్యాంక్ ఏటీఎం నుంచి 5 సార్లు నగదు ఉపసంహరించుకోగలుగుతారు.
► మీ బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు రహిత లావాదేవీలకు పరిమితి లేదు. మీకు కావలసినన్ని సార్లు బదిలీ వంటి లావాదేవీలు చేయగలరు.
► ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకం నిషేధించింది. వాటిని 3 నుండి 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో నగదు రహిత లావాదేవీలు కూడా ఉన్నాయి.
► ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి 3 సార్లు నగదు ఉపసంహరించుకోవచ్చు.
► మెట్రో నగరాలు మినహా దేశంలో ఎక్కడైనా 5 సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలనును ఉపయోగించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోండి లేదా విచారించండి లేదా బదిలీ చేయండి .. అన్ని నగదు, నగదు రహిత లావాదేవీలకు 5 రెట్లు పరిమితి ఉంటుంది.
Enjoy unlimited transactions at any Ujjivan Small Finance Bank ATM or bank branch. Withdraw and deposit money without any second thoughts. Wishing you a very happy World Senior Citizens Day!#UjjivanSFB #WorldSeniorCitizensDay pic.twitter.com/Vt3DuUpJb6
— Ujjivan Small Finance Bank (@UjjivanBank) August 21, 2021