
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తాజాగా సరికొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ వివరాలను మరింత సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ గుర్తింపు ప్లాట్‌ఫామ్ ద్వారా ఇకపై భౌతిక ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోనుంది. ఈ కొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కొత్త ఆధార్ యాప్ యూజర్లకు భద్రత, ప్రైవసీని పెంచే అనేక కీలక ఫీచర్లను అందిస్తుంది:
డిజిటల్ ఫార్మాట్: ఈ యాప్ కార్డుదారులకు వారి ఆధార్ కార్డును భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించి, డిజిటల్ ఫార్మాట్‌లో అందిస్తుంది. అసురక్షిత PDF కాపీల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఫోర్జరీ నుండి రక్షణ: ఆధార్ వివరాలను ఎవరూ ఫోర్జరీ చేయలేరు. సురక్షితంగా ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఆధార్: ఒక్కరే తమతో సహా తమ కుటుంబ సభ్యుల ఐదుగురి ఆధార్ ప్రొఫైల్‌లను ఈ యాప్‌లో పెట్టుకోవచ్చు.
బయోమెట్రిక్ లాక్: అవసరం లేనప్పుడు మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసి ఉంచుకోవచ్చు.
QR కోడ్: దీని ద్వారా హోటళ్లు లేదా దుకాణాలలో అడిగినప్పుడు మీ వివరాలను సులభంగా స్కాన్ చేసి ఇవ్వవచ్చు.
అప్‌డేట్ వివరాలు: మీరు ఆధార్‌లో ఏదైనా మార్పు (అప్‌డేట్) చేస్తే, అది ఈ యాప్‌లో వెంటనే కనిపిస్తుంది.
కొత్త ఆధార్ యాప్: ఇది మీ ఆధార్ వివరాలను కేవలం సురక్షితంగా నిల్వ చేయడానికి, చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో సేవలు పరిమితం.
mAadhaar యాప్: ఇది డిజిటల్ ఆధార్ డౌన్‌లోడ్ చేయడం, కొత్త పీవీసీ కార్డు ఆర్డర్ చేయడం, మొబైల్ నంబర్ వెరిఫై చేయడం వంటి చాలా రకాల సేవలను అందిస్తుంది.