Yatra IPO: మార్కెట్లోకి మరో ఐపీవో.. రూ.750 కోట్ల మెగా ఇష్యూకు సిద్ధమౌతున్న ట్రావెల్ కంపెనీ..

|

Mar 27, 2022 | 10:44 AM

Yatra IPO: దేశంలో ప్రయాణ సేవల(Travel service provider) అందిస్తున్న ప్రఖ్యాత సంస్థ యాత్రా ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ ఐపీవో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఇనీషియల్ ప్రబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Yatra IPO: మార్కెట్లోకి మరో ఐపీవో.. రూ.750 కోట్ల మెగా ఇష్యూకు సిద్ధమౌతున్న ట్రావెల్ కంపెనీ..
Yatra Ipo
Follow us on

Yatra IPO: దేశంలో ప్రయాణ సేవల(Travel service provider) అందిస్తున్న ప్రఖ్యాత సంస్థ యాత్రా ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ ఐపీవో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఇనీషియల్ ప్రబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రూ. 750 కోట్లను సమీకరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద శనివారం DRHP పత్రాలను దాఖలు చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (Offer For Sale) పద్ధతిలో మరో 93,28,358 షేర్లను కంపెనీ తన ఐపీవోలో విక్రయించనుంది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో టీహెచ్‌సీఎల్‌ ట్రావెల్‌ హోల్డింగ్స్‌ సైప్రస్‌ లిమిటెడ్‌ 88,96,998 షేర్లను, పండారా ట్రస్ట్‌ తన ట్రస్టీ Vistra ITC ద్వారా 4,31,360 షేర్లను అమ్మనున్నాయి. మరోవైపు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌లో రూ.145 కోట్ల విలువైన కొత్త షేర్లను విక్రయించాలని కంపెనీ భావిస్తున్నట్లు DRHPలో వెల్లడించింది.

వ్యూహాత్మక పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు వంటి వాటి కోసం ఈ ఐపీఓ నుంచి సమీకరించే డబ్బును యాత్రా సంస్థ వెచ్చించనుంది. SBI Capital మార్కెట్స్‌ లిమిటెడ్‌, DAM క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌, IIFL సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ సంస్థలు ఈ ఐపీవోకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్‌ మాతృ సంస్థ ‘యాత్రా ఆన్‌లైన్‌ ఇంక్‌’.. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యింది.

ఇవీ చదవండి..

Home: 2 BHK లేదా 3 BHK ఏ ఇల్లు కొనుక్కోవాలి.. ఎందుకంటే..?

Multibagger stock: ఇన్వెస్టర్ల సంపదను 87 రెట్లు పెంచిన అదానీ షేర్.. మీ దగ్గర ఉందా..?

House Purchase: చిన్న ఇల్లు కొంటే పెద్ద లాభం.. ఎలాగో తెలుసా..