దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అంటే రైల్వేశాఖ అని అందరికి తెలిసిందే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేవారు ముందుగా టికెట్లను బుక్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో బుకింగ్స్ చేస్తుంటారు. అయితే టికెట్స్ బుకింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే ఐఆర్‌సీటీసీ. దీనిలో చాలా మంది టికెట్స్‌ను బుక్ చేసుకుంటారు. దూర ప్రయాణం చేసేవారు ముందస్తుగా టికెట్లను రిజర్వ్ చేసుకుంటారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాల సదుపాయాలను మెరుగు పరుస్తూ ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకు వస్తుంటుంది రైల్వే శాఖ. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే చాలా మంది పేటీఎం వాలెట్‌ను ఉపయోగించేవారు. Paytm బ్యాంక్‌పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధం కారణంగా IRCTC eWallet గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ సర్వీసు కొనసాగుతుందా లేదా అన్న అయోమయం నెలకొంది. మరి ఈ సర్వీసును నిలిపివేస్తే ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముందుగా IRCTC వాలెట్ సర్వీస్ ఏమిటో తెలుసుకుందాం.
IRCTC eWallet ఫీచర్లు ఏమిటి?
1) టిక్కెట్‌కు చెల్లింపు గేట్‌వే ఛార్జీలు ఉండవు.
2) వాలెట్ టాప్-అప్ ఆన్‌లైన్‌లో చేయవచ్చు.
3) నిర్దిష్ట బ్యాంక్ నెట్‌వర్క్‌పై ఆధారపడటం అంటూ ఉండదు.
4) టికెట్ రద్దు చేసినట్లయితే వాపసు మొత్తం IRCTC ఇ-వాలెట్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
5) లావాదేవీ చరిత్ర, వాలెట్ చెల్లింపు, లావాదేవీ పాస్‌వర్డ్ రక్షణ ఫీచర్లు అన్నీ IRCTC eWallet యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి
IRCTC వెబ్‌సైట్ ప్రకారం, ఐఆర్‌సీటీసీ లావాదేవీ పాస్‌వర్డ్/పిన్ నంబర్‌ను అందిస్తుంది. ఫలితంగా IRCTC eWallet ద్వారా రైలు టిక్కెట్లను సురక్షితంగా బుక్ చేసుకోవచ్చు. ప్రతి టికెట్ బుకింగ్ IRCTC eWallet ద్వారా చేయాలి. బ్యాంకులు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పటికీ ఈవాలెట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఈ సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ సమస్య కారణంగా చాలా సార్లు బ్యాంకింగ్ చెల్లింపు ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఫలితంగా టిక్కెట్ బుకింగ్ ఆలస్యం అవుతుంది. కానీ, ఈవాలెట్ సిస్టమ్ ద్వారా చెల్లించడం ద్వారా టికెట్ బుకింగ్ సులభంగా చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి