రిస్క్ ఎక్కువే.. రాబడి మాత్రం అదిరిపోతోంది.. 6 నెలల్లోనే 2700 శాతం లాభం.. పెన్నీ స్టాక్స్‌తో అట్లుంటుది మరి.!

|

Jun 23, 2022 | 5:24 PM

Multibagger Stocks: పెన్నీ స్టాక్స్ కూడా అలాంటివే. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రాబడి వస్తుందని నిపుణులు అంటుంటారు. ఇప్పటి వరకు చాలా పెన్నీ స్టాక్స్ ఇలాంటి బాటలోనే పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి.

రిస్క్ ఎక్కువే.. రాబడి మాత్రం అదిరిపోతోంది.. 6 నెలల్లోనే 2700 శాతం లాభం.. పెన్నీ స్టాక్స్‌తో అట్లుంటుది మరి.!
Multibagger Stocks
Follow us on

రిస్క్ హై తో ఇష్క్ హై… వెబ్ సిరీస్ స్కామ్ 1992లో ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు. పెన్నీ స్టాక్స్ కూడా అలాంటివే. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రాబడి వస్తుందని అంటుంటారు. పెన్నీ స్టాక్స్ అంటే చిన్న కంపెనీల స్టాక్స్. వాటి ధర చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో 10 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న స్టాక్‌లను పెన్నీ స్టాక్స్ అని పిలుస్తుంటారు. ఇటువంటి స్టాక్‌ల లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్‌లో ఈ స్టాక్‌లను కొనుగోలు చేసేవారు ఎక్కువ మంది ఉండరు. పెన్నీ స్టాక్స్ కొనడం చాలా ప్రమాదకరంగా కూడా మారొచ్చు. అయితే, ఈ స్టాక్స్ అధిక రాబడిని ఇస్తాయని మాత్రం అంటుంటారు. ఉదాహరణకు, కైజర్ కార్పొరేషన్ స్టాక్ ఈ సంవత్సరం సుమారు 2700% రాబడిని ఇచ్చింది. అంటే 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.27 లక్షలు అయ్యేది. కాబట్టి పెన్నీ స్టాక్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

2022లో టాప్ 5 మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లను ఓసారి చూద్దాం..

కైజర్ కార్పొరేషన్

ఇవి కూడా చదవండి

కైజర్ కార్పొరేషన్ స్టాక్ ఈ సంవత్సరం దాదాపు 2700% లాభపడింది. దీని షేరు ధర 31 డిసెంబర్ 2021న రూ. 2.79గా ఉంది. అది ఈరోజు రూ.77.80కి పెరిగింది. 6 నెలల క్రితం షేర్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలు వచ్చాయి.

Gallop Enterprises

గత 6 నెలల్లో Gallop Enterprises షేరు ధర రూ.4.56 నుంచి రూ.107.30కి పెరిగింది. ఈ కంపెనీ షేర్ ధర 2300% పైగా పెరిగింది.

హేమాంగ్ రిసోర్సెస్

డిసెంబర్ 31, 2021న హేమాంగ్ రిసోర్సెస్ ఒక షేరు ధర రూ. 3.09లుగా ఉంది. ఈరోజు రూ. 48.90కి పెరిగింది. దీని స్టాక్ ధర 1400% కంటే ఎక్కువ పెరిగింది. 6 నెలల లోపు పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది.

అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్

డిసెంబర్ 31, 2021న రూ.2.71గా ఉన్న అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ షేర్ ధర.. ఈరోజు రూ.25.50కి పెరిగింది. గత 6 నెలల్లో దాదాపు 800% పెరిగింది.

మిడ్ ఇండియా ఇండస్ట్రీస్

గత 6 నెలల్లో మిడ్ ఇండియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు రూ.3.53 నుంచి రూ.22.35కి పెరిగింది. షేర్ ధర 500% పైగా పెరిగింది.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకుంటుంది. మార్కెట్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాకే, పెట్టుబడులు పెట్టాలి. స్వంత నిర్ణయాల కంటే నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచింది.