
పార్క్ ప్లస్ రీసెర్చ్ ల్యాబ్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారి ఆలోచన మారిందని తేలింది. ముఖ్యంగా వారు సెకండ్ హ్యాండ్ కార్లకంటే కొత్త కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఆకర్షణ కోల్పోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారతదేశంలో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిలో 77 శాతం కొత్త కార్లను కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో ప్రీ-ఓన్డ్ కార్ వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విశ్వాస సమస్యలను సూచిస్తుందని నివేదిక వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
అలాగే డెలాయిట్ నివేదిక ప్రకారం దాదాపు 90 శాతం సెకండ్ హ్యాండ్ కార్లు కేవలం రూ.10 లక్షల లోపు ధరల్లో ఉంటేనే కొనుగోలు చేస్తున్నారని తేలింది. ముఖ్యంగా కొత్త కార్ల విషయంలో సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికల వల్ల చాలా మంది కొత్త కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని అనుకునే వారు సహచరుల హెచ్చరికలు, ప్రతికూల ఆన్‌లైన్ సమీక్షలు లేదా ప్రత్యక్ష నిరాశల కారణంగా తాము వెనక్కి తగ్గినట్లు 65 శాతం మంది చెప్పారు. దాదాపు 43 శాతం మంది చట్టపరమైన సమస్యలను ఉదహరించగా, 22 శాతం మంది ఆర్‌సీ బదిలీ జాప్యాలను ఎత్తి చూపారు. 11 శాతం మంది డిజిటల్ రివ్యూలు పేలవంగా ఉన్నాయని ఆరోపించారు.
అయితే సెకండ్ కొనుగోళ్లు అనేవి స్థానిక కార్ డీలర్ల వద్ద అధికంగానే ఉన్నాయని అది కూడా వారిపై ఉన్న విశ్వాసం నేపథ్యంలో అమ్మకాలు సాగుతున్నాయని నివేదికలో హైలేట్ చేశారు. దాదాపు 73 శాతం మంది స్థానిక అమ్మకందారుల వల్లే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసినట్లు వివరించారని నివేదికలో పేర్కొన్నారు. యూజ్‌డ్ కార్ల రంగంలో డాక్యుమెంటేషన్ వివాదాలు, అసంపూర్ణ యాజమాన్య బదిలీలు, మోసపూరిత జాబితాలు కొనసాగుతున్నాయి. కొనుగోలుదారులు మెరుగైన నియంత్రణ, మరింత పారదర్శక ప్రక్రియలతో పాటు సున్నితమైన, సురక్షితమైన లావాదేవీలకు హామీ ఇచ్చే వ్యవస్థ కోసం డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి