AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault: దేశంలో పరుగులు పెట్టనున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. క్విడ్ ఈవీతో పాటు రెండు కార్ల విడుదలకు సన్నాహాలు

మన దేశంలో కార్ల వినియోగం ప్రతి ఏటా క్రమంగా పెరుగుతోంది. సంపన్నులతో పాటు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కార్లకు ఆదరణ బాగున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ మార్కెట్ ను విస్తరించేందుకు చర్యలు ప్రారంభించాయి. దేశ ప్రజల అవసరాలు, ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

Renault: దేశంలో పరుగులు పెట్టనున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. క్విడ్ ఈవీతో పాటు రెండు కార్ల విడుదలకు సన్నాహాలు
Renault
Nikhil
|

Updated on: Jun 28, 2025 | 3:45 PM

Share

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహహనాల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ రెనాల్ట్ త్వరలో క్విడ్ ఈవీ పేరుతో ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారును మన దేశంలో విడుదల చేయనుంది. దాని ప్రత్యేకతలు, ఇతర విషయాలు తెలుసుకుందాం. రెనాల్ట్ కంపెనీ తన చిన్న కారు క్విడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ను త్వరలో మార్కెట్ లోకి తీసుకు రానుంది. దీన్ని గురించి పూర్తిస్తాయి సమాచారం లేనప్పటికీ పరీక్షల సమయంలో అనేక సార్లు కనిపించింది. తమిళినాడులో కనిపించిన ఈ కారుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్లేటు ఏర్పాటు చేశారు. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. రెనాల్ట్ విడుదల చేసిన స్ప్రింగ్ ఈవీ మాదిరిగానే కొత్త క్విడ్ ఈవీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు స్పల్ప తేడాతో ఓకే మాదిరిగా ఉంటాయి. స్పింగ్ ఈవీలో 26.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి సింగిల్ చార్జింగ్ తో సుమారు 220 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్ కు అనుకూలంగా రూపొందించారు. క్విడ్ ఈవీ ఫీచర్లు కూడా అలాగే ఉంటాయని భావిస్తున్నారు.

స్ప్రింగ్ ఈవీలో ఏడు అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పది అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త క్విడ్ ఈవీలో కూడా ఇదే స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు వెహికల్ టు లోడ్, వెహికల్ టు చార్జింగ్ తదితర హైటెక్ ఫీచర్లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మన దేశ మార్కెట్ లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే చర్యల్లో భాగంగా రెనాల్ట్ తన కొత్త క్విడ్ ఈవీని విడుదల చేస్తుందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న టాటా టియాగో, ఎంజీ కామెట్ ఈవీలకు ఈ కొత్త కారు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీ 2026లో కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కొత్త డస్టర్, బోరియల్ కార్లను ఆవిష్కరించనుంది. ఆ తర్వాత హైబ్రిడ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో క్విట్ ఈవీ కూడా మార్కెట్ లో సందడి చేయనుంది. పరీక్షల సమయంలో కనిపించిన ఈ మోడల్ గురించి పెద్దగా సమాచారం రాలేదు. అయితే కారు చాలా కొత్తదనంతో ఆకట్టుకుంది. గత పెట్రోలు వెర్షన్ కంటే పూర్తి భిన్నంగా మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్టు సమాచారం. విండ్ షీల్డ్ వాషర్, వైపర్, షార్క్, ఫిన్ యాంటెన్నా, పార్కింగ్ సెన్సార్ వెనుక భాగంలో అమర్చారు. ఈ కొత్త ఈవీ ఏడాది చివరిలో లేదా 2026లో విడుదలయ్యే అవకాాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us