AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax Rules Changed: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్‌ అందించింది కేంద్ర ప్రభుత్వం. టోల్‌ ప్లాజాల గుండా వెళ్లే వాహనాలకు భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పుడు 70 శాతం డిస్కౌంట్‌తో టోల్‌ ట్యాంక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 30 శాతం మాత్రమే చెల్లించాలి. ఇది..

Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి
Tollgate
Subhash Goud
|

Updated on: Jan 25, 2026 | 12:30 PM

Share

Toll Tax Rules Changed: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది.

నిర్మాణ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనాలు:

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008 నాటి జాతీయ రహదారి రుసుము నియమాలను సవరించింది. దీని ప్రకారం, రెండు లేన్ల జాతీయ రహదారిని నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు చేస్తుంటే ఆ కాలంలో వాహనదారుల నుండి పూర్తి టోల్ పన్ను వసూలు చేయరు. నిర్మాణం ప్రారంభం నుండి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిర్దేశించిన టోల్‌లో 30 శాతం మాత్రమే చెల్లించాలి. దీంతో 70 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Silver Profit: ఏడాది కిందట వెండి కొంటే ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు!

ఇవి కూడా చదవండి

కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

ఈ విషయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నియమం కొత్త సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఈ నియమం కొత్త ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం కాదు, రెండు లేన్ల రోడ్లను నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ లేన్లుగా మారుస్తున్న అన్ని ప్రస్తుత జాతీయ రహదారులకు కూడా వర్తిస్తుంది.

దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్:

అధికారుల ప్రకారం.. దేశంలోని దాదాపు 25,000 నుండి 30,000 కిలోమీటర్ల రెండు లైన్ల జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులపై సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. జాతీయ రహదారులపై సరుకు రవాణా వాటాను ప్రస్తుత 40 శాతం నుండి 80 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నాలుగు లేన్ల నుండి ఆరు లేదా ఎనిమిది లేన్లకు మార్చినప్పుడు కూడా ఉపశమనం:

నాలుగు లేన్ల రహదారిని ఆరు లేదా ఎనిమిది లేన్లుగా మారుస్తున్నప్పుడు ప్రయాణికులకు టోల్ పన్నుపై 25 శాతం తగ్గింపును సవరించిన నియమాలు కూడా అందిస్తాయి. అలాంటి సందర్భాలలో డ్రైవర్లు నిర్దేశించిన టోల్‌లో 75 శాతం మాత్రమే చెల్లించాలి.

ఇప్పటికే అమలులో ఉన్న మరొక నియమం:

టోల్ రోడ్డు ఖర్చు పూర్తిగా రికవరీ అయిన తర్వాత టోల్ పన్నులో 40 శాతం మాత్రమే వసూలు చేయాలనే నియమం ఇప్పటికే వర్తిస్తుందని గమనించాలి. ఇప్పుడు కొత్త మార్పులతో, నిర్మాణ సమయంలో కూడా ప్రయాణికులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది.

Gold Price Today: తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చదవండి: Flipkart Republic Day: కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి