Petrol Price Today: వాహన దారులకు ఒక గుడ్‌ న్యూస్‌, ఒక బ్యాడ్‌ న్యూస్‌.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ..

|

Feb 13, 2022 | 8:59 AM

Petrol Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల నుంచి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అయితే...

Petrol Price Today: వాహన దారులకు ఒక గుడ్‌ న్యూస్‌, ఒక బ్యాడ్‌ న్యూస్‌.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ..
Follow us on

Petrol Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల నుంచి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు కచ్చితంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయని డెలాయిట్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ అంచనా వేసింది.

అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న ఈ నేపథ్యంలో కేంద్రం ఇంధన ధరల పెంపు విషయంలో నిర్ణయం తీసుకోవట్లేదని సమాచారం. మార్చి 10 తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేశ వ్యాప్తంగా ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 95.41 కాగా, డీజిల్‌ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.98 గా ఉండగా, డీజిల్‌ రూ. 94.14 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.40 కాగా, డీజిల్‌ రూ. 91.43 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.58 గా ఉండగా, డీజిల్‌ రూ. 85.01 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 108.20 గా ఉంది, డీజిల్‌ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110.51 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 96.59 గా ఉంది.

* సాగర తీరం విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.05 గా ఉండగా, డీజిల్‌ రూ. 95.18 గా నమోదైంది.

Also Read: Telangana Gateway: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్

Cumin Water: ఆరోగ్యానికి మంచిదని జీలకర్ర నీటిని తాగుతున్నారా..? అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే..