Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా ఏప్రిల్ 5 (మంగళవారం) దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver )ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 తగ్గుముఖం పట్టగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గుముఖం పట్టింది. ఇక కిలో వెండిపై రూ.200లకుపైగా తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980,
☛ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140
☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140 ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140,
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,140 ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, ముంబైలో రూ.66,600 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కోల్‌కతాలో రూ.66,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కేరళలో రూ.71,400 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, విజయవాడలో రూ.71,400 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.
ఇవి కూడా చదవండి: