Stocks Investment: ఆ ప్రభుత్వ స్టాక్‌లో పెట్టుబడితో రాబడి వరద.. పూర్తి వివరాలివే..!
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. ముఖ్యంగా స్థిర ఆదాయాన్ని ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాలతో కాకుండా రిస్క్ ఎక్కువైనా పర్లేదని మంచి రాబడినిచ్చే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడికి తక్కువ రిస్క్ ఉండడంతో పాటు రాబడినిచ్చే మంచి స్టాక్స్ కోసం యువత అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారికి ఓ ప్రభుత్వ రంగ స్టాక్ అధిక రాబడినిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అధిక రాబడి అవకాశాల కోసం చూస్తున్న పెట్టుబడిదారులు ప్రభుత్వ మద్దతు ఉన్న స్టాక్‌ను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేవలం ఒక నెలలోనే 49 శాతం వరకు రాబడిని అందించిందని వివరిస్తున్నారు. ఈ కంపెనీ మార్చి త్రైమాసికంలో బలమైన పనితీరుతో మెరుగైన రాబడిని అందించింది. ముఖ్యంగా దాని శుద్ధి విభాగంలో ఇది లాభాలను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను 34 మంది విశ్లేషకులు కవర్ చేస్తున్నారు. వారిలో 22 మంది దీనికి ‘కొనుగోలు’ రేటింగ్ ఇచ్చారు. ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 10 డాలర్లు తగ్గితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ ఇన్వెంటరీ నష్టానికి దారితీయవచ్చని ఓ ప్రముఖ పరిశోధన సంస్థ తన నివేదికలో పేర్కొంది.
రిఫైనింగ్ మార్జిన్‌లో కొంత బలహీనత ఉన్నప్పటికీ ఈ కంపెనీ మార్కెటింగ్ మార్జిన్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత నిర్వహణ లాభం అంచనాలు వరుసగా 15 శాతం నుంచి 17 శాతం వరకు ఉండవచ్చనిన ఇపుణులు చెబుతున్నారు. అలాగే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ స్టాక్‌కు ‘కొనుగోలు’ రేటింగ్ ఇచ్చి దాని ప్రస్తుత ధర కంటే దాదాపు 49 వాతం ఎక్కువ ధరను రూ.205గా నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ స్టాక్‌ను ‘వ్యూహాత్మక ఆట’గా మోర్గాన్ స్టాన్లీ కంపెనీ అభివర్ణించింది. ఈ స్టాక్ రాబోయే 30 రోజుల్లో గణనీయమైన లాభాలను అందిస్తుందని పేర్కొంటుంది. వంట గ్యాస్‌పై నష్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్థిరమైన ఇంధన ధరలను సంస్థ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో రూ.142.50 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపు ఇది 3.37 శాతం పెరిగింది. గత నెలలో స్టాక్ ధర దాదాపు తొమ్మిది శాతం పెరిగింది. 2025లో ఇప్పటివరకు ఇండియన్ ఆయిల్ స్టాక్ 4 శాతం బలపడింది, అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 17 శాతం తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








