Citroen EC3: వారే అసలు టార్గెట్… భారతీయ మార్కెట్‌లో మరో ఈవీ కారును లాంచ్ చేస్తున్న సిట్రోయెన్..!
ప్రముఖ కంపెనీ అయిన సిట్రోయెన్ ఈసీ3 పేరుతో కొత్త టాప్ ఎండ్ షైన్ వేరియంట్‌ను భారతదేశ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా ఈ కంపెనీ షైన్ వేరియంట్ శ్రేణిని రూ.13.19 లక్షల నుంచి అందిస్తోంది. ది సిట్రోయెన్ సీ3 షైన్ 4 వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. షైన్, షైన్ వైబ్ ప్యాక్, షైన్ డ్యూయల్ టోన్, షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ రూ. 13.19 లక్షల నుంచి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈవీ వాహనాలు వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ కార్లతో పోల్చుకుంటే ఈవీ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రస్తుత కాలంలో ప్రత్యేక అప్‌డేట్స్‌తో వస్తున్న ఈవీ కార్లను వాహన ప్రియులు ఇష్టపడుతున్నారు. దీంతో అన్ని కంపెనీలు తమ ఈవీ వెర్షన్స్‌లో కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన సిట్రోయెన్ ఈసీ3 పేరుతో కొత్త టాప్ ఎండ్ షైన్ వేరియంట్‌ను భారతదేశ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా ఈ కంపెనీ షైన్ వేరియంట్ శ్రేణిని రూ.13.19 లక్షల నుంచి అందిస్తోంది. ది సిట్రోయెన్ సీ3 షైన్ 4 వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. షైన్, షైన్ వైబ్ ప్యాక్, షైన్ డ్యూయల్ టోన్, షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ రూ. 13.19 లక్షల నుంచి ఉంటుంది. ఈ కారు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కొత్త సిట్రోయెన్ ఈసీ 3 షైన్లో ఫ్రంట్, రియర్ స్కిడ్-ప్లేట్లు, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవీఆర్‌ఎంలు, రియర్ వైపర్, రియర్ డీఫాగర్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. కొత్త వేరియంట్ దాని ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌తో పాటు పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.ఈసీ 3 షైన్ వేరియంట్ కూడా 56.22 బీహెచ్‌పీ, 143 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా గంటకు 107 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ కారు 6.8 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
సిట్రోయెన్ ఈసీ3 27.2 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారును ఓ సారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు బ్యాటరీను డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 57 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 315 లీటర్ల బూట్ స్పేస్, 2540 ఎంఎం వీల్ బేస్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. సిట్రోయెన్ ఈసీ 3 నాలుగు మోనోటోన్ ఎంపికలతో సహా 11 రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, 7 డ్యూయల్ టోన్ ఎంపికలు అంటే స్టీల్ గ్రే విత్ ప్లాటినం గ్రే రూఫ్, పోలార్ వైట్ విత్ ప్లాటినం గ్రే రూఫ్, ప్లాటినం గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, స్టీల్ గ్రే విత్ కాస్మో బ్లూ రూఫ్, పోలార్ వైట్ విత్ కాస్మో బ్లూ రూఫ్, కాస్మో బ్లూ పోలార్ వైట్ రూఫ్‌తో ఈ కారు అందరి మనస్సులను దోచుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి