AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI FDs: సీనియర్‌ సిటిజన్లకు గోల్డెన్‌ చాన్స్‌.. మార్చి 31తో ఆఖరు.. త్వరపడండి..

దేశీయ అగ్ర రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధుల కోసం అదిరే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ ను ప్రకటించింది. దాని పేరు ఎస్బీఐ వీకేర్ స్పెషల్ ఎఫ్డీ. దీనిలో అధిక ప్రయోజనాలు వృద్ధులకు ఉంటాయి. అయితే ఈ పథకం గడువు మార్చి 31తో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SBI FDs: సీనియర్‌ సిటిజన్లకు గోల్డెన్‌ చాన్స్‌.. మార్చి 31తో ఆఖరు.. త్వరపడండి..
Fd Rate
Madhu
|

Updated on: Mar 13, 2024 | 8:22 AM

Share

సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. వీటిలో అధిక వడ్డీతో పాటు స్థిరమైన రాబడి కారణంగా అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ కు ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్లలో అధిక ప్రయోజనాలు ఉంటాయి. అధిక వడ్డీ లభిస్తుంది. ఇటీవల కాలంలో పలు బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించాయి. కొన్ని ప్రత్యేకమైన స్కీమ్లను ప్రకటించాయి. మరికొన్ని ఇప్పటికే ఉన్న పథకాల గడువును ప్రకటించాయి. ఈ క్రమంలో దేశీయ అగ్ర రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధుల కోసం అదిరే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ ను ప్రకటించింది. దాని పేరు ఎస్బీఐ వీకేర్ స్పెషల్ ఎఫ్డీ. దీనిలో అధిక ప్రయోజనాలు వృద్ధులకు ఉంటాయి. అయితే ఈ పథకం గడువు మార్చి 31తో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎస్‌బీఐ వీకేర్‌ ప్రత్యేక ఎఫ్‌డీ..

స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రవేశపెట్టిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకమే ఎస్‌బీఐ వీకేర్‌. దీనిద్వారా సీనియర్‌ సిటిజన్లకు వారి డిపాజిట్లపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అయితే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిపై 3.50% నుంచి 7.50% మధ్య ఉంటాయి. ఎస్‌బీఐ వీకేర్‌ ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు అయిదేళ్ల నుంచి పదేళ్ల వరకూ అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.

చివరి తేదీ..

ఎస్‌బీఐ వీకేర్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈనెల (మార్చి) 31 వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఈ పథకంలో తాజాగా డిపాజిట్లు చేసుకోవచ్చు. లేదా మెచ్యూరింగ్ డిపాజిట్లను పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంది. డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • 7 నుంచి 45 రోజుల డిపాజిట్లకు 4 శాతం
  • 46 నుంచి 179 రోజులకు 5.25 శాతం
  • 180 నుంచి 210 రోజులకు 6.25 శాతం
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు 6.5 శాతం
  • ఏడాది నుంచి రెండేళ్ల లోపు 7.3 శాతం
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు 7.5 శాతం
  • మూడేళ్ల నుంచి అయిదేళ్ల లోపు 7.25 శాతం
  • అయిదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.50 శాతం

స్టేట్‌బ్యాంకు అందించే మరిన్ని ఎఫ్‌డీ పథకాలు

ఎస్‌బీఐ అమృత్ కలశ్‌.. ఇది ప్రత్యేకంగా రూపొందించిన డిపాజిట్‌ పథకం. దీని ద్వారా సీనియర్‌ సిటిజన్లు మంచి వడ్డీరేటు పొందవచ్చు. వారికి 400 రోజుల కాలవ్యవధిపై చేసిన డిపాజిట్లకు 7.60% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం ఈనెల 31 వరకూ అందుబాటులో ఉంది.

ఎస్‌బీఐ గ్రీన్‌ డిపాజిట్లు.. ఈ పథకం కూడా సీనియర్‌ సిటిజన్లకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. దీనిలో 1,111 రోజులు, 1,777 రోజుల వ్యవధికి వేసిన డిపాజిట్లపై 7.15% వడ్డీ రేటు లభిస్తుంది. రిటైల్ డిపాజిట్లకు సంబంధించి 2,222 రోజుల వ్యవధిలో 7.40% వడ్డీరేటును బ్యాంకు అందిస్తుంది.

సర్వోత్తమ్‌ టర్మ్ డిపాజిట్లు.. ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ల కింద బ్యాంక్ రెండేళ్ల కాలవ్యవధికి 7.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం కాలపరిమితికి రిటైల్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 7.60 శాతంగా నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..