టూ వీలర్లను సౌకర్యవంతంగా మార్చడంలో సీట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ దూరాలు ప్రయాణించేటప్పుడు. ఒక సౌకర్యవంతమైన సీటు మీ ప్రయాణాన్ని చాలా సులభతం చేయడంతో నొప్పి లేని విధంగా మీ గమ్యస్థానానికి చేర్చుతుంది. అయితే ఆ సీటు సౌకర్యవంతంగా ఉందా లేదా ఎలా నిర్థారిస్తాం? ఆ సీటు తయారు చేసిన మెటీరియల్, దాని ఆకారం, పరిమాణం, కుషనింగ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. సౌకర్యవంతమైన సీటు కావాలంటే అధిక నాణ్యత కలిగిన మెటీరియల్స్ అయిన లెదర్, హైడెన్సిటీ ఫోమ్ వంటివి వాడాలి. ఇవి రైడర్ కు సపోర్టు ఇవ్వడంతో పాటు ప్రెజర్ పాయింట్లను తగ్గించి సౌకర్యాన్ని అందిస్తుంది. ఒక వేళ మీరు ఎక్కువ దూరాలు టూ వీలర్ల పై ప్రయాణాలు చేసే వారైతే, అందుకోసం సౌకర్యవంతమైన సీటు కలిగిన బైక్ కోసం చూస్తున్నట్లు అయితే, ఈ కథనం మిస్ అవ్వొద్దు. ఎందుకంటే మన మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యవంతమైన సీట్లు కలిగిన టూ వీలర్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో క్రూయిజర్, అడ్వెంచర్ టూరర్, స్పోర్ట్ బైక్, వంటి బెస్ట్ మోడల్ బైక్స్ ఉన్నాయి.
ఈ బైక్ సౌకర్యవంతమన ప్లష్ సీట్ తో వస్తుంది. ఇది రైడర్ తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా సపోర్టు ఇస్తుంది. దీంతో రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ పాయింట్ ఆధారంగానే సూపర్ మెటోర్ 650ని లాంచ్ చేసింది. మెటోర్ 350 ఆర్కిటెక్చర్ ఆధారంగానే ఇది లాంచ్ అయ్యింది. ఇది లాంగ్ టూర్లకు సరిగ్గా సరిపోతోంది.
ఈ బైక్ లో వెడల్పాటి, సౌకర్యవంతమైన సీట్లు మంచి కుషనింగ్ తో వస్తాయి. ఈ బైక్ ధర రూ. 5,79,952(ఎక్స్ షోరూం ఢిల్లీ) ఉంది. ఇది 471.03సీసీ ప్యారలెల్ ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 47బీహెచ్పీ, 43.2ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సుదూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
బీఎండబ్ల్యూ ఆర్ 1250జీఎస్.. దీనికి పెద్ద, సౌకర్యవంతమైన సీటును అందిస్తుంది. ఇది రైడర్ తో పాటు వెనుక కూర్చుకున్న వ్యక్తికి కూడా అద్భుతమైన సపోర్టును అందిస్తుంది. దీనిలో అనేక రకాలైన అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఇంటిగ్రల్ ఏబీఎస్ ప్రో, హిల్ స్టార్ట్ కంట్రోల్ వంటి ఉన్నాయి. ఇది కూడా దూర ప్రయాణాలకు అనువైన ఎంపిక. దీని ధర రూ. 20.55లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ క్లాసిక్ స్టైల్ కలిగిన మోటార్ సైకిల్ లో మంచి కుషనింగ్ తో సౌకర్యవంతమైన సీటు వస్తుంది. దీని ధరలు రూ. 11.09లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి వస్తాయి. ఇది దూర ప్రాంతాలు ప్రయాణం చేసే వారికి బెస్ట్ చాయిస్ గా ఉంటుంది.
ఈ బైక్ కి కూడా వెడల్పాటి సీటు మంచి కుషనింగ్ తో ఉంటుంది. ఇది గతుల రోడ్డులోనూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. సింగిల్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది.
ఈ బైక్ రైడర్ తో పాటు వెనుక కూర్చొనే వారికి మంచి సౌకర్యవంతమైన సీటును అందిస్తుంది. ఇది కఠినమైన పరిస్థితుల్లో కూడా స్మూత్ రైడ్ అందిస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఎంపిక.
ఈ బైక్ అడ్వెంచర్ టూరింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్. ఈ బైక్ రైడింగ్ పొజిషన్ పైకి ఉంటుంది. ఇది మీ వెన్నుపాముపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని సీటు మంచి కుషనింగ్ తో ఉంటుంది. ఎక్కువసేపు ప్రయాణం చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..