AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Banking: బీ అలర్ట్‌.. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేటప్పుడు ఈ తప్పులు చేశారో.. హాం ఫట్‌..

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. వాటిల్లో ప్రధానమైనది అకౌంట్‌ పాస్‌ వర్డ్‌. ఇది చాలా బలమైనదిగా ఉండాలి. దానిని క్రమం తప్పకుండా మార్చాలి. అలాగే కనపడిన ప్రతీ లింక్‌ లను క్లిక్‌ చేయకూడదు. ఆఫర్ల పేరిట వేసే వలలో చిక్కకూడదు.

Online Banking: బీ అలర్ట్‌.. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేటప్పుడు ఈ తప్పులు చేశారో.. హాం ఫట్‌..
Online Banking
Madhu
|

Updated on: Jul 14, 2023 | 7:00 AM

Share

ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కరోనా అనంతర పరిణామాల్లో ప్రభుత్వాలు కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంతో అందరూ యూపీఐ పేమెంట్స్‌తో పాటు ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించడం అలవాటు చేసుకున్నారు. అయితే అందివస్తున్న సాంకేతికతతో ఎంత మేర ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే మేర ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఏమాత్రం ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఖాతాకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండటంటో పాటు ప్రైవసీని కాపాడుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ చోరీలను నిరోధించే అవకాశం ఉంటుంది.

కొన్ని నియమాలు పాటించాల్సిందే..

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. వాటిల్లో ప్రధానమైనది అకౌంట్‌ పాస్‌ వర్డ్‌. ఇది చాలా బలమైనదిగా ఉండాలి. దానిని క్రమం తప్పకుండా మార్చాలి. అలాగే కనపడిన ప్రతీ లింక్‌ లను క్లిక్‌ చేయకూడదు. ఆఫర్ల పేరిట వేసే వలలో చిక్కకూడదు. పబ్లిక్‌ వైఫై ని వినియోగించి ఆన్‌ లైన్‌ లావాదేవీలు అస్సలు చేయకూడదు. మీ డివైజ్‌ సాఫ్ట్‌ వేర్‌ లను ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేయాల్సిందే. అవసరం అయితే మీ కంప్యూటర్‌కు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టుకోవడం కూడా మంచిది. అలాగే బ్యాంకర్లు ఎప్పటికప్పుడు సూచించే మార్గదర్శకాలను అనుసరించాలి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులకు కొన్ని సూచనలు చేస్తోంది. వినియోగదారులు చేయాల్సిన, చేయకూడని పనులను వివరించింది. అవేంటో చూద్దాం..

ఇవి కూడా చదవండి

నెట్‌ బ్యాంకింగ్‌ చేసేటప్పుడు ఇవి తప్పనిసరి..

  • మీ కస్టమర్ ఐడీ ఐపిన్‌లను గోప్యంగా ఉంచాలి. బ్యాంక్ సిబ్బందితో సహా ఎవరికీ దానిని చెప్పొద్దు.
  • బ్రౌజర్ చిరునామా బార్‌లో బ్యాంక్ వెబ్‌సైట్ చిరునామా (www[dot]hdfcbank[dot]com) టైప్ చేయడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్ పేజీలోకి వెళ్లి.. దాని నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ సైట్‌ని సందర్శించండి.
  • మీ బ్రౌజర్‌లో “ఆటో కంప్లీట్” ఫీచర్‌ని డిజేబుల్ చేయండి.
  • మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ చేస్తున్నప్పుడు వర్చువల్ కీబోర్డ్ ఫీచర్‌ని ఉపయోగించండి.
  • మీ రహస్య ఖాతా సమాచారాన్ని ఎల్లప్పుడూ టైప్ చేయండి. దానిని కాపీ పేస్ట్ చేయవద్దు.
  • మీ లావాదేవీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్‌స్టా అలెర్ట్స్‌ సేవను ఉపయోగించండి.
  • ఏదైనా మోసపూరిత లావాదేవీని బ్యాంక్ దృష్టికి తీసుకురండి. మీరు నెట్‌బ్యాంకింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు తప్పనిసరిగా లాగ్ అవుట్ చేయండి. బ్రౌజర్‌ను నేరుగా మూసివేయవద్దు.
  • మీ నెట్‌బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా మీరు దాన్ని స్వీకరించిన వెంటనే మీ ఐపిన్‌ని మార్చండి. దానిని మనసులో గుర్తు పెట్టుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కడా రాయవద్దు.
  • మీ కంప్యూటర్‌లో ఫైర్‌వాల్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందో లేదో తనిఖీ చేసుకోండి మీ ఐపిన్‌ని క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి.
  • బ్యాంక్ వెబ్‌సైట్‌లో, చెల్లుబాటు అయ్యే ఎస్‌ఎస్‌ఎల్‌ భద్రతా ప్రమాణపత్రం (https) కోసం తనిఖీ చేయండి. httpకి జోడించిన “S” సురక్షిత వెబ్‌సైట్‌ను సూచిస్తుంది.

ఇవి అస్సలు చేయొద్దు..

  • సైబర్ కేఫ్‌లు లేదా హోటళ్లు/విమానాశ్రయాలు మొదలైన పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల వంటి షేర్డ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను యాక్సెస్ చేయడాన్ని నివారించండి.
  • మీ నెట్‌బ్యాంకింగ్ వెబ్‌పేజీని యాక్సెస్ చేయడానికి www.hdfcbank.com కాకుండా ఇతర ఈ-మెయిల్‌లు లేదా సైట్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
  • మీ పాస్‌వర్డ్‌లను ఎక్కడా రాయవద్దు.
  • మీ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, డెబిట్ కార్డ్ నంబర్, సీవీవీ మొదలైనవాటిని ఎవరికీ (బ్యాంక్ సిబ్బందితో సహా) వెల్లడించవద్దు.
  • వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించే ఈ-మెయిల్స్‌కు ప్రతిస్పందించవద్దు.
  • మీ పుట్టిన తేదీ, జీవిత భాగస్వామి పేరు మొదలైనవాటిని సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లను ఎంచుకోవద్దు.
  • అటాచ్‌మెంట్ విశ్వసనీయ మూలం నుంచి కాకపోతే దానిని డౌన్‌లోడ్ చేయవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..