Car Mileage: కారు అధిక మైలేజీ ఇవ్వాలా? అయితే ఈ చిట్కాలు జస్ట్ ఫాలో అయిపోండి చాలు..

కారు కొనడంతో పాటు దాని నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే మైలేజ్ బాగుంటుంది. అన్ని కార్లు మైలేజీని ఇవ్వవు. లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు పెద్దగా మైలేజీ రావు. అయితే సాధారణ కార్లు కాస్త ఎక్కువ మైలేజీ ఇస్తాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఆ కార్లు మైలేజీని ఇస్తాయి. కారు ఇంజిన్ తో సంబంధం లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కారు మైలేజీ పెరుగుతుందంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు.

Car Mileage: కారు అధిక మైలేజీ ఇవ్వాలా? అయితే ఈ చిట్కాలు జస్ట్ ఫాలో అయిపోండి చాలు..
Car Mileage

Updated on: Mar 01, 2024 | 9:22 AM

మధ్యతరగతి ప్రజలు కూడా కారు వాడడం నేడు సాధారణ విషయం. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ప్రయాణాల కోసం కారును కొనుగోలు చేస్తున్నారు. వాటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రావడం మరో కారణం. అయితే కారు కొనడంతో పాటు దాని నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే మైలేజ్ బాగుంటుంది. అన్ని కార్లు మైలేజీని ఇవ్వవు. లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు పెద్దగా మైలేజీ రావు. అయితే సాధారణ మధ్య తరగతి ప్రజలు వినియోగించే కార్లు కాస్త ఎక్కువ మైలేజీ ఇస్తాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఆ కార్లు మైలేజీని ఇస్తాయి. కారు ఇంజిన్ తో సంబంధం లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కారు మైలేజీ పెరుగుతుందంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఆ జాగ్రత్తలు ఏంటి? కారు మైలేజీని పెంచే చిట్కాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

టైర్లలో సరిపడినంత గాలి.. కారు టైర్లలో గాలి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. టైర్ కు తగినంత ఒత్తిడి ఉంటేనే కారు ముందుకు పరుగెడుతుంది. తయారీదారులు కారులోని నాలుగు టైర్లలో స్థిరమైన గాలిని నింపాలని చెబుతారు. అయితే ఇంజిన్ బరువు కారణంగా ముందు ఉండే టైర్లపై బరువు పడుతుంది. కారు ముందు టైర్లలో 40 పీఎస్ఎల్, వెనుక టైర్లలో 35 పీఎస్ఎల్ గాలి నింపాలి. ఇలా చేయడం వల్ల బ్రేకులు వేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

టైర్ అలైన్మెంట్.. గతులకు రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రభావం మన టైర్ల అమరికపై పడుతుంది. ప్రతి 5000 కిలోమీటర్లకు కారు అలైన్ మెంట్ ను సరి చేయాలి. ప్రతి 10000 కిలోమీటర్లకు టైర్ బ్యాలెన్సింగ్, రొటేషన్ చేయాలి. అదే ఎప్పుడు సాఫీ రోడ్లపై ప్రయాణం చేస్తుంటే సర్వీస్ కాల వ్యవధిని పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టైర్ సైజు.. టైర్లు బాగా పెద్దవిగా ఉంటే వాటిని తిప్పటానికి ఇంజిన్ కు ఎక్కువ సామర్థ్యం కావాలి. దాని ప్రభావం మైలేజ్ పై పడుతుంది. మ్రుదువైన కాంపౌండ్ టైర్లు ప్రయోజనకరంగా ఉంటాయి. మెరుగైన గ్రిప్ పొందాలంటే అధిక స్పీడ్ రేటింగ్ టైర్లను కొనుగోలు చేయాలి.

మినిమం స్పీడ్.. ప్రతి గేర్ లోనూ మీ స్పీడో మీటర్లో ఎరుపు రంగును తాకే వరకూ ఫెడల్ ను తొక్కడం ఇంజిన్ కు మంచిది కాదు. 2000 ఆర్పీఎం వద్ద అప్ షిప్ట్ చేసి పెడల్ ను అన్ని విధాలుగా పుష్ చేస్తే సరి.

డ్రైవింగ్ టెక్నిక్.. డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రమాదవశాత్తూ జరిగే మరమ్మతుల నుంచి కాపాడుకోవచ్చు. ముందు, వెనుక వచ్చే వాహనాలను గమనిస్తూ అవసరమైనప్పుడు వేగం పెంచడం, తగ్గించడం చేయాలి.

గేర్ షిఫ్టింగ్.. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి కోస్టింగ్ పాటించాలి. మీరు గేర్ లో వెళ్లాలా, వద్దా అనేది ట్రాఫిక్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 60 మీటర్ల దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి, మీ కారు సరైన వేగంలో వేగంలో ఉంటే వెంటనే న్యూట్రల్ చేయాలి. గేర్ కోస్టింగ్ లో ఉంటే ఎక్కువ ఇంధన వినియోగం ఉండదు.

కారు ఎలా ఉండాలి.. చిన్న ప్రయాణాల కోసం చిన్ని డిస్ ప్లేస్ మెంట్ ఇంజిన్ కారును ఎంచుకోండి. చిన్న ఇంజిన్లు తక్కువ వేగంతో మరింత సామర్థ్యంతో పని చేస్తాయి. అదే సమయంలో జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలలో ప్రయాణానికి పెద్ద ఇంజిన్ల కార్లను ఉపయోగించాలి. వాటిపై అధిక వేగంతో వెళ్లినా తక్కువ ఇంధనం ఖర్చవుతుంది.

మెయింటెనెన్స్.. ఆయిల్, ఫిల్టర్లను ప్రతి పది వేల కిలోమీటర్లకు మార్చాలని కారు మాన్యువల్ చెబుతుంది. అయితే వాటిని తొమ్మిది వేల కిలోమీటర్లకు మార్చుకుంటే మంచిది. ఇంజిన్ సామర్థ్యం పెంచి, ఎక్కువ మైలేజీ రావడానికి వీలుంటుంది.

పార్కింగ్ సమయంలో.. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు కారును పార్కింగ్ చేసి ఉంచితే అనేక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా టైర్ నొక్కుకుపోయి బీటలు ఏర్పడతాయి. తర్వాత మనం ఆ కారు టైర్లలో గాలిని నింపి ప్రయాణం చేసినప్పుడు రోడ్డు ఒత్తిడి కారణంగా టైరు పేలిపోతుంది. కారును ఎక్కువ కాలం పార్కింగ్ చేసినా టైర్లలో గాలిని సరి చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..